మహమ్మారి అట్టుడికిస్తోంది. భయపెట్టే రోజులు తిరిగి వచ్చాయి. అయితే ఈ పరిస్థితి ఉన్నా ప్రశాంతంగా జీవించడం ఎలా? అంటే.. ఇంట్లో నాలుగు గోడల మధ్య కూచుని హస్తకళల్ని పెయింటింగ్ ని ప్రదర్శించడం ఉత్తమ మార్గం. గత సంవత్సరం మాదిరిగానే ఇప్పటి సెకండ్ లాక్ డౌన్ లో జాన్వీ కపూర్ తనలోని సరికొత్త కళకు పదును పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ తాను గీసిన అందమైన పెయింటింగ్ లను అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేసింది.
సముద్రం.. చంద్రుడు.. మేఘాలతో ప్రకృతి-నేపథ్య కాన్వాసుతో అద్భుత చిత్రలేఖనమిది. ``పెయింటింగ్ డేస్ తిరిగి వచ్చాయి`` అనే శీర్షికను ఈ ఫోటోకి ఉపయోగించింది జాన్వీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ పెయింటింగ్ ని ప్రతి ఒక్కరూ వీక్షించే సౌలభ్యం ఉంది. యానిమేటెడ్ పాత్రలు.. ప్రకృతి సహా మతం రిలేటెడ్ గా ఉండే వివిధ ఇతివృత్తాలపై పెయింటింగ్స్ ని షేర్ చేశారు జాన్వీ. తన ఆర్ట్ ను ప్రపంచానికి ప్రదర్శిస్తూ వారం రోజులుగా చిత్రకారిణిగా మారిపోయాను.. అని తెలిపారు.
ఇంతకుముందు సంవత్సరంలో రకరకాల రంగులతో ప్రత్యేక డిజైనర్ కళాకృతిని సిద్ధం చేసిన జాన్వీ ఈసారి కొత్తగా ప్రయత్నించారు. ఆర్ట్ సిద్ధమయ్యేప్పుడు.. చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. నేలపై మరకలు పడకుండా ఉండటానికి బహుళ పెయింట్ బ్రష్ లు.. కలర్ ట్యూబ్ లు.. సీసాలు.. కాన్వాసులు.. వీటన్నిటి కిందా వార్తాపత్రికలను ఉపయోగించారు. సెల్ఫ్-ఐసోలేషన్ ఉత్పాదకత అని కూడా జాన్వీ హ్యాష్ ట్యాగ్ లను కూడా జోడించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ.. దోస్తానా 2 వంటి చిత్రాల్లో నిస్తున్నారు. కరణ్ జోహార్ తఖ్త్ పెండింగులో ఉంది. సారా తదుపరి `అట్రాంగి రే`లో ధనుష్ - అక్షయ్ లాంటి స్టార్ల సరసన కనిపించనుంది.