రాజమౌళి ఆఫర్ కే నో చెప్పిన హీరోయిన్ ?

Update: 2019-06-20 06:14 GMT
ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిని సెట్ చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి వస్తున్నట్టు కనిపించడం లేదు. రామ్ చరణ్ కు అలియా భట్ ను లాక్ చేసుకున్నాక తమ హీరోకు భామను ఎప్పుడు ప్రకటిస్తారా అని యంగ్ టైగర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం అయితే విదేశీ వనిత కావాలి. కానీ డైసీ హ్యాండ్ ఇవ్వడంతో ఆ స్థానాన్ని పేరున్న సెలబ్రిటీతో భర్తీ చేయడం జక్కన్నకు సవాల్ గా మారింది.

దీంతో కథలో కీలక మార్పు చేసి ఆ పాత్రను భారతీయ యువతిగా మార్చినట్టు టాక్ ఉంది. సరే ఇదే బెటర్ అనుకుంటే ఇప్పుడా సెలక్షన్ కూడా క్రిటికల్ గా మారిందని తెలిసింది. ముంబై టాక్ ప్రకారం రాజమౌళి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని కలిసి పాత్రను ఆఫర్ చేశాడట. అయితే టాలీవుడ్ మొదటి సినిమా కాబట్టి తనకు వెయిట్ ఉండాలని కోరుకుంటున్నానని కానీ ఇందులో అంత స్కోప్ కనిపించడం లేదని నో చెప్పిందట. ఇది నిజమో కాదో కానీ టాక్ అయితే జోరుగా ఉంది.

గతంలో శ్రీదేవి ఇలాగే శివగామి పాత్రకు రెమ్యునరేషన్ పరంగా నో చెప్పిందనే వార్త పెద్ద సంచలనమే అయ్యింది. శ్రీదేవి దాన్ని ఖండిస్తూ ప్రకటన కూడా జారీ చేశారు. ఇప్పుడు ఆవిడ లేదు కానీ ఇక్కడ చూస్తేనేమో జాన్వీ కపూర్ రాజమౌళి సినిమా వద్దనుకోవడం మాత్రం తెలివైన నిర్ణయం కాదేమోనని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. జాన్వీ ఇంకా స్టార్ గా ఎదగలేదు. చేసిందే ఒక్క సినిమా. ఇలాంటి తరుణంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ బంగారం లాంటి ఛాన్స్ వదులుకుంటే ఎలా. దీని గురించి రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి

    

Tags:    

Similar News