అతడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటుడయ్యాడు. హీరోగా అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇంతింతై అన్న చందంగా నటనలో పరిణతితో హీరోగా ఎదిగాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రామిస్సింగ్ స్టార్ హీరోల్లో ఒకడిగా సత్తా చాటుతున్నాడు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇక సామాన్యుడి అసామాన్య ప్రయత్నంగా అతడి నుంచి అభిమానులు స్ఫూర్తి పొందాల్సిన సందర్భమిది. అందరు నటుల్లానే ఆరంభ రోజుల్లో జీవనం కోసం ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పుడు ఇంతగా ఎదగడం అన్నది అతడి కృషి పట్టుదలకు నిదర్శనం. అతడు ఇప్పుడు ఏకంగా అమితాబ్ బచ్చన్ .. జాన్వీ కపూర్ లాంటి స్టార్లు నివాసం ఉండే పరిసరాల్లో 44 కోట్లతో క్వాడ్రప్లెక్స్ ఇల్లు కొన్నాడు. ఇంతకీ ఎవరా హీరో? అంటే.. పేరు రాజ్ కుమార్ రావు.
సెలబ్రిటీలంతా నివాసం ఉండే పోష్ ఏరియా జుహులో ట్రిపుల్స్ అపార్ట్ మెంట్ కొనుగోలు కోసం రూ. రూ. 44 కోట్లు చెల్లించడమే గాక.. రిజిస్ట్రేషన్ కి 2.19 కోట్లు చెల్లించారు. 6 ప్రత్యేకమైన పార్కింగ్ స్లాట్ లతో కూడిన ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసేందుకు రాజ్ కుమార్ రావు రూ.46 కోట్ల వరకూ వెచ్చించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకుముందే రణ్ వీర్ సింగ్ బాంద్రాలో సీ-వ్యూ క్వాడ్రప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయడానికి 119 కోట్లు వెచ్చించాడని విన్నాం. ఇంతలోనే రాజ్ కుమార్ రావు..పత్రలేఖ జంట జుహూలో కొత్త ఆస్తిని సంపాదించడానికి రూ.44 కోట్లు వెచ్చించడం విశేషం. తాజా కథనాల ప్రకారం.. రావు - పత్రలేఖ జంట జుహూలో ఒక ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసారు. అది బోనీ కపూర్ కుమార్తె జాన్వీ కపూర్ కి చెందిన అపార్ట్ మెంట్ అని తెలిసింది.
3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని 2020 డిసెంబర్ లో జాన్వీ కపూర్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఆస్తిని రాజ్ కుమార్ రావుకు విక్రయించినట్లు తెలుస్తోంది. దీని ధరను చ.అ.కు దాదాపు రూ.1.27 లక్షలుగా నిర్ణయించారు.
ఈ అపార్ట్ మెంట్ 14వ 15వ 16వ అంతస్తులలో అటాచ్డ్ గా ఉంటుంది. దాంతో పాటు ఆరు పార్కింగ్ స్లాట్ లకు ప్రత్యేకమైన యాక్సెస్ కోసం రూ.2.19 కోట్లను రిజిస్ట్రేషన్ గా వెచ్చించారని కూడా తెలుస్తోంది. ప్రీమియం ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ అమ్మకం కొనుగోలు గురించి ఇరువైపుల నుండి ఎటువంటి ధృవీకరణ లేనప్పటికీ జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.