బ్లూ-సీ నేప‌థ్యంలో జాన్వీ లుక్ అదిరిందిగా

Update: 2022-06-09 02:30 GMT
న‌టిగా కెరీర్ ప్రారంభించిన జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాల్లోనూ త‌న‌దైన మార్క్ తో దూసుకుపోతోంది. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా త‌న‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్నా యూనిక్ స్టైల్ తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది. జాన్వీ ఇప్ప‌టికే న‌టిగా చాలా ప‌రిణ‌తి చెందింది. త‌న ఎంపిక‌లు ఆక‌ర్షిస్తున్నాయి. ఒక ఫ్యాష‌నిస్టాగా సోష‌ల్ మీడియా క్వీన్ గానూ జాన్వీ వెలిగిపోతోంది. వ‌రుస గా బోల్డ్ ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది.

తాజాగా జాన్వీ షేర్ చేసిన ఓ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్‌ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.  తాజా లుక్ లో ఈ కుర్ర బ్యూటీ ఎక్కువ స్కిన్ షో పై దృష్టి సారించ‌లేదు కానీ.. ఎంతో క‌ళాత్మ‌క లుక్ తో ఆక‌ర్షించింది.  ఇక ఫ్లోర‌ల్ ఫ్రాకులో థై స్లిట్ ఎలివేష‌న్ తో యువ‌త‌రానికి ఫ్యాష‌న్ గోల్స్ ని సెట్ చేసింద‌ని చెప్పాలి. త‌న బాడీ హ‌గ్గింగ్ ఫ్రాక్ శరీరాకృతి ఎలివేట్ చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. జాన్వీ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. రొమాంటిక్ కామెడీ దోస్తానా 2 విడుద‌ల‌కు రావాల్సి ఉంది. అలాగే ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన `గుడ్ లక్ జెర్రీ`లో జాన్వీ కపూర్ నటిస్తోం. హెలెన్ రీమేక్ `మిల్లీ`లోను నాయిక‌. రూహి సహనటుడు రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి లో న‌టిస్తోంది. వరుణ్ ధావన్ తో `భ‌వాల్` అనే చిత్రం చేస్తోంది. నేటిత‌రంలో వ‌రుస ఆఫ‌ర్ల‌తో క్రేజీ నాయిక‌గా వెలిగిపోతోంది జాన్వీ.  అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. కొంతమంది అగ్ర తెలుగు చిత్రనిర్మాతలు ఇప్పటికే ఇదే పనిలో ఉన్నారు. కానీ జాన్వీ ఎందుక‌నో ఇంకా వేచి చూస్తోంది.
Tags:    

Similar News