నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా... మిస్సమ్మ సాంగ్ ఇది. అక్కడ పాడేవాళ్లదే పాట.. ఆడేవాళ్లదే ఆట! ముంబై నగరంలో నైట్ పార్టీల వ్యవహారాన్ని టచ్ చేస్తే బోలెడంత కిక్కు.
చూస్తుంటే ముంబై పార్టీలో చిలౌట్ చేసిన లైగర్ టీమ్ కి అలాంటి కిక్కు కు కొదవేమీ లేదని చెప్పాలి. కరణ్ జోహార్ - మనీష్ మల్హోత్రా లాంటి ఉద్ధండులు అదిరిపోయే పార్టీకి ప్లాన్ చేయడం అందులో మత్తుగా చిత్తుగా లైగర్ టీమ్ ఎంజాయ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అపూర్వ మెహతా బర్త్ డే కంటే కూడా లైగర్ టీమ్ కి ప్రచారం అవసరం అని ఈ పార్టీ చెప్పకనే చెప్పింది.
ఈ పార్టీ నుంచి ఒక్కో ఫోటో ఒక్కో క్లాస్ లుక్ లుక్ తో మతులు చెడగొడుతోంది. లైగర్ టీమ్ ఫుల్ జోష్ లో కనిపించింది. ఇక ఇందులోంచి ఒక క్లాసీ బ్లర్డ్ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో ఇంతకీ ఏం ఉంది? అన్నది తరచి చూస్తే.. ఫోటోలో లైగర్ హీరో విజయ్ వేదరకొండ చెంత నటవారసురాలు జాన్వీ కపూర్ హొయలు పోతున్న తీరు కిక్కు పెంచింది. చూడ ముచ్చటైన జంట అంటూ ఈ ఫోటో చూశాక విజయ్ - జాన్వీ జంటకు కితాబిచ్చేస్తున్నారు. నిజానికి ఈ జోడీ లైగర్ సెట్స్ పైకి వెళ్లాల్సింది.
కానీ ఎందుకనో కుదరలేదు. జాక్ పాట్ అనన్య పాండేకి దక్కింది. విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంట సూపర్ క్లిక్ అయ్యింది. డూపర్ క్యూట్ గాళ్ అనన్య తెలుగు ఆడియెన్ ని మత్తులోకి దించేయడం ఖాయమని కూడా ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. #జాన్వీ.. లైగర్ లో ఛాన్స్ మిస్సయినా కానీ..! తదుపరి చిత్రంలో వీడీ సరసన ఆఫర్ అందుకుంటుందనడంలో సందేహం లేదు. తన ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు? అంటే విజయ్ పేరునే చెబుతున్న జాన్వీ క్రష్ నెరవేరే రోజు ఇంకెంతో దూరంలో లేదని కూడా హింట్ అందింది.
ఇకపోతే ఈ హాటెస్ట్ ఫోటోగ్రాఫ్ వెనక ఎవరున్నారు? అంటే.. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఉన్నారు. జాన్వీ - అనన్య సహా ఎందరికో ఆయనే డిజైనర్. ఇప్పుడు విజయ్ దేవరకొండకు కూడా ఆయనే డిజైనర్ గా వ్యవహరిస్తున్నారన్నది చెప్పాల్సిన పని లేదు.