ట్రైలర్ టాక్: నాయకా.. డైలాగులే తేడా

Update: 2017-07-31 17:22 GMT
స్టోరీ ఉన్నా లేకపోయినా కూడా ఫైట్లు.. కటౌట్లుకు మించిన డైలాగులూ.. బీభత్సమైన స్లో మోషన్ నరుకుళ్లు నెత్తుటి చారలు.. ఇవన్నీ బోయపాటి శ్రీను సినిమాలో కామన్. ఇప్పుడు అదే కోవలో ఈ దర్శకుడు మార్కు యాక్షన్ ఎంటర్టయినైర్ గా ఇప్పుడు ''జయ జానకి నాయక'' సినిమా వస్తోంది. పొరపాటున యాక్షన్ మానేసి లవ్ స్టోరీ చేస్తున్నాడేమో అని కొత్తలో డౌట్లు తెప్పించాడు కాని.. ఇప్పుడు ట్రైలర్ తో తనేం మారలేదని.. ఎప్పటికీ బి-సి సెంటర్లకు మాత్రమే తాను సినిమాలు బోయపాటి ప్రూవ్ చేసుకున్నాడు.

యథావిథిగా ఒక హీరో. ఒక హీరోయిన్. హీరో బాగా యాక్షన్ రిచ్. హీరోయిన్ బాగా గ్లామర్ రిచ్. ఇక ఖరీదైన విలన్లు. డబ్బున్న విలనీయులు. అందరూ కొట్టుకుంటే అదే 'జయ జానకి నాయక'. హీరోకేమో హీరోయిన్ అంటే ప్రేమ. హీరోయిన్ కు హీరోను మార్చాలని ప్రేమ. విలన్లకు ఇతడు గొడవకు వచ్చాడని గొడవలపై ప్రేమ. ఇక సవాల్ చేస్తున్నా శవాల్ లేస్తాయ్ అంటూ వార్నింగ్ ఇచ్చేసి ఆ హీరో తనను తాను ఒక భారీ కటౌట్లా ఎత్తిచూపిస్తాడు. అప్పుడు సీనియర్ విలన్ ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి కత అనేదే సినిమా. ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్.. రకుల్ ప్రగ్యా క్యాథరీన్ల గ్లామర్.. పంచు డైలాగులూ బాగానే ఉన్నాయి కాని.. ఎక్కడో బెల్లంకొండ శ్రీనివాస్ డైలాగులే చెబుతుంటే మాత్రం రుచించట్లేదు. ఎందుకో మనోడు వాయిస్ పైన వర్క్ చేయలేదనే అనిపిస్తోంది.

ఇకపోతే ఇంకా స్టార్డమ్ రాని ఒక హీరోతో ఇలా ఓవర్ స్టార్డమ్ ఉన్న ఊరమాస్ హీరోను పెట్టేసి తీసినట్లు సినిమా తీస్తే అది సింహా అండ్ సరైనోడు తరహాలో క్లిక్ అవుతుందా అంటే... దానికి ఆన్సర్ బోయపాటే చెప్పాలి. మొత్తం ట్రైలర్లో బోయపాటి రేంజ్ యాక్షన్ తప్పిస్తే రుషి పంజాబీ ఫోటోగ్రాఫి ఆసక్తికరంగా ఉంది.

Full View
Tags:    

Similar News