బెల్లంకొండ కుర్రాడు టాలెంట్ చూపించాడే

Update: 2017-08-15 08:09 GMT
గత వారం రిలీజ్ అయిన మూడు సినిమాల మధ్య పోటీ గట్టిగానే సాగింది. మిక్సీడ్ టాక్ వచ్చినా మూడు సినిమాలు కలెక్షన్స్ లో దేని స్థాయికి తగ్గట్టు అది రాబడుతోంది. అయితే ఈ పోటీలో ఎక్కువగా రానా-బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య బి-సి సెంటర్లలో రమారమీ అంటూ సాగుతోంది. జయ జానకి నాయక తక్కువ మార్కెట్ లో ఎక్కువ వసూళ్ళను సాధించిగా.. ఇక నేనే రాజు నేనే మంత్రి అంతగా కాకపోయినా రానా మార్కెట్ తో ఒకే అనిపించాడు.

"నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రి రిలీజ్ ని ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం వలన.. మొదటి వారాంతానికి  18.50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అంటే 10.83 కోట్ల షేర్స్ ను అందించింది. మార్కెట్ రేంజ్ ని బట్టి రానా సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు నిర్మాతలు. దానితో నైజాం-ఏపీ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్న మొదటి వారం షేర్ 8.55 కోట్లు అలాగే ఓవర్సీస్ మరియు ఇతర రాష్ట్రాల కలెక్షన్స్ కలుపోవుకొని 10.83 కోట్లతో సరిపెట్టుకుంది.

ఇక మొదటి సారి బెల్లంకొండ వారి అబ్బాయి ప్రి రిలీజ్ బిసినెస్ లో తన స్థాయిని పెంచుకున్నాడు. మొదటి వారాంతానికి 15కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకొని 9.07 కోట్ల షేర్స్ ని అందించాడు.  జయ జానకి నాయక అనుకున్న  దాని కంటే ఎక్కువ స్థాయిలోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. నితిన్-రానా సినిమాలకంటే జయ జానకి నాయక మొదటి రెండు రోజులు ఎక్కువ కలెక్షన్లతో ఆదరగొట్టింది. నైజాం-ఏపీ లో మొదటి వారం షేర్స్ 8.02 కోట్లు. ఇక ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమా 9.07 కొట్లతో సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఇక వచ్చే వారం వీక్ కుడా ఇలానే కొనసాగితే బెల్లం కొండ శ్రీనివాస్ ఈ పోటీలో టాప్ లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News