సరైనోడుతో కమర్షీయల్ హిట్ కొట్టిన బోయపాటి ఇప్పుడు బెల్లకొండ శ్రీనివాస్ తో జయజానకినాయక తీసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా కాస్త ఎక్కువుగానే పెట్టారు. ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ - ప్రగ్యాజైస్వాల్ - క్యాథరిన్ లతో మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు బోయపాటి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ కు రిలీజ్ డేట్ విషయంలో అడ్డంకులు ఎదురైయ్యాయి. 40 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టినప్పటికి ఈ సినిమా బిజినెస్ బోయపాటికి ఉన్న క్రేజ్ తో సజావుగా జరిగిపోయింది. ఎటొచ్చి రిలీజ్ డేట్ దగ్గరే జయజానకినాయక ఇబ్బంది పడుతుందని ట్రేడ్ వర్గాలు ఊహించాయి.
అయితే ఆగస్ట్ 11న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని ఆగస్ట్ 10కి ప్రీపోన్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే ఒక రోజు ముందుగానే జయజానకి నాయకని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు బోయపాటి ప్లాన్ చేశాడు. ఆగస్ట్ 11న రిలీజ్ సినిమాలు నుంచి పోటీ వస్తుండటంతో జయజానకినాయకను సేవ్ చేసేందుకు బోయపాటి ఈ ఎత్తుగడ వేసినట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకి వస్తున్న జయజానకి నాయక సినీ జనాల్ని ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.