ఇప్పుడు బోయపాటి శ్రీను అంటేనే కేరాఫ్ మాస్ సినిమాలు. అయితే సడన్ గా మనోడు 'జయ జానకి నాయక' అనే టైటిల్ ప్రకటించగానే.. అమ్మో పందా మార్చేసి ఏదో సీరియస్ లవ్ స్టోరి ఒకటి తీస్తున్నాడని అందరూ అనుకున్నారు. అయితే అదంతా నిజమేనా? నిజంగానే మాస్ శ్రీను పూర్తిగా క్లాస్ శీనుగా మారిపోయాడా? హిట్టు కొట్టి ఎలాగైనా తను కూడా ఒక డిపెండబుల్ హీరో అనిపించుకోవాలని చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కు కొత్త లక్ ఏమన్నా తెస్తున్నాడా?
అదంతా తెలియదు కాని.. ఇప్పుడు బోయపాటి మాత్రం తన అసలు రంగును బయటెట్టేశాడు. అదేనండి.. తన సినిమాల్లో ఉండే ఆ మాస్ కలర్ ను చూపించకనే చూపించాడు. జయ జానకి నాయక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ అవతారం ఎలా ఉంటుందో తన కొత్త పోస్టర్లో చూపెట్టాడు బోయపాటి. ఒక ప్రక్కన చూడ్డానికి ఇది సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ లుక్ తరహాలో అనిపిస్తున్నా కూడ.. బోయపాటి ట్రేడ్ మార్క్ అంటే ఇదే కదా అంటున్నారు అభిమానులు. మొత్తానికి ఇన్నాళ్ళూ కొత్త సినిమా ఏదో తీస్తున్నట్లున్నాడు అంటూ కంగారుడిన పంపిణీదారులు.. ఒక్కసారిగా ఈ మాస్ టచ్ చూసి కాస్త రిలాక్స్ అయిపోయారు.
ఇకపోతే తన గత సినిమాల్లో హీరోయిన్లు ఎలాగైతే భారీ గ్లామర్ ను అద్దేశారో.. ఇక్కడ కూడా రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రగ్యా జైస్వాల్ అదే రేంజులో దారపోశారటలే. కాకపోతే విషయం ఏంటంటే.. ఈ మధ్యన మరీ ఊరమాస్ సినిమాలను మన ఆడియన్స్ అస్సలు ఒప్పుకోవట్లేదు. పెద్ద హీరోల సినిమాలు అయినా కూడా వాటిని తిప్పికొట్టేస్తున్నారు. కాబట్టి బోయపాటి ఈ సినిమాను ఒక మాంచి ప్రేమకథగా తీసుంటేనే అది కొత్తగా అనిపించే ఛాన్సుంది. లేదని అదే మాస్ సినిమా తీస్తే మాత్రం.. ప్చ్. చూద్దాం ఏమవుతుందో.