టీజర్ టాక్: సరైనోడికి డూప్లికేటులా..

Update: 2017-07-12 05:52 GMT
ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను తన కొత్త సినిమా ''జయ జానకి నాయక''తో దూసుకొస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బోయపాటి ఒక్కరే అతిపెద్ద సెల్లింగ్ పాయింట్. హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. హీరోయిన్ రకుల్ ప్రీత్.. ప్రగ్యా జైస్వాల్.. క్యాథరీన్ త్రెసాతో ఐటెం సాంగ్.. ఇవన్నీ సెకండరీ అనే చెప్పాలి. ఇంతకీ ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

నిజానికి ఈ టీజర్ తో సినిమా థీమ్ అనేది ఏమాత్రం చెప్పనేలేదు బోయపాటి. కేవలం సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి తీసిన విజువల్ రిచ్నెస్ మాత్రమే ఈ టీజర్లో కనిపించింది. ఓ రకంగా చూస్తే.. టైట్ షార్ట్ హ్యాండ్స్ షర్టులు వేసుకున్న  బెల్లంకొండ శ్రీనివాస్ అచ్చం 'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్ కు డూపులా ఉన్నాడు. ఇక రకుల్ ప్రీత్ కూడా ఆ సినిమాలో ఉన్నట్లే కనిపించింది. అలాగే రిషి పంజాబీ తీసిన ఎలివేషన్ బ్లాక్స్ కూడా అలానే ఉన్నాయి. ఇక దర్శకుడు కూడా సరైనోడు సినిమాను తీశాక ఈ మూవీ తీస్తున్నాడు కాబట్టి.. అదే హ్యాంగోవర్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ టీజర్ యావత్తూ సరైనోడికి డూప్లికేటులాగానే ఉంది.

ప్రస్తుతానికి పెద్దగా ఆసక్తి రేపలేకపోయినా ఈ ''జయ జానకి నాయక'' మరి ట్రైలర్ తో ఏమన్నా సత్తా చాటుతుందేమో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు చాలా హై-బడ్జెట్ అయ్యిందని వార్తలొస్తున్న వేళ.. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ అండ్ రిలీజ్ ఎలా ఉంటుందో కాస్త సందేహంగానే ఉంది. అది సంగతి.

Full View
Tags:    

Similar News