జయలలిత నా ఇన్‌ స్పిరేష‌న్‌!

Update: 2018-10-31 04:20 GMT
దేనికైనా టైమ్ రావాలి.. ఇప్పుడు నా టైమ్‌.. ఇక ఆడుకుంటా! అంటోంది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్. ఈ అమ్మ‌డు న‌టించిన పందెంకోడి 2 త‌ర్వాత ఈ దీపావ‌ళి కానుక‌గా `స‌ర్కార్` రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వ‌రూ ముచ్చ‌టించింది.

ముఖ్యంగా త‌మిళ‌నాట రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ చాలా ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని ముచ్చ‌టించింది. ఇంత‌కీ మీరు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా?  వ‌స్తే మీ నాన్న‌గారి పార్టీలో చేర‌తారా? అంటే త‌న‌లోని రెబ‌ల్‌ ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. అస‌లు నాన్న పార్టీలో చేర‌ను. అమ్మ జ‌య‌ల‌లిత స్ఫూర్తితో రాజ‌కీయాల్లోకి వ‌స్తాను. నాయ‌కురాలిన‌వుతాను! అంటూ పెద్ద పెద్ద స్టేట్‌ మెంట్లే ఇచ్చింది. ఇంట‌ర్వ్యూ ఆద్యంతం వ‌రూ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ అంద‌రినీ క‌ట్టిప‌డేసింద‌న్న మాటా వినిపించింది. రాజ‌కీయాల్లోకి ఎవ‌రైనా రావొచ్చు. మంచి వాళ్లు రావాలి. ర‌జ‌నీ - క‌మ‌ల్ హాస‌న్ అంకుల్ రాజ‌కీయాల్లోకి రావ‌డం సంతోషం...అని వ‌రూ తెలిపింది. తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని - అయితే నాన్న పార్టీలో చేర‌న‌ని క‌రాఖండిగా చెప్పేసింది.

సర్కార్ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారా? అని ప్ర‌శ్నిస్తే.. అలా అని నేను చెప్పలేదు. అలా అని పాజిటివ్ క్యారెక్టర్ కాదు. నేను చాలా స్మార్ట్. ఇందులో నాది పొలిటీషియన్ రోల్.. అంటూ టూకీగా చెప్పింది కానీ అస‌లేమీ రివీల్ చేయ‌లేదు. మురుగదాస్ ఎప్పుడూ వచ్చి ఆయన సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ సినిమాలో కూడా అలానే ఉంటుంది. కీర్తి సురేష్ పాత్రకు - నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. పందెంకోడి సినిమాలో భవాని క్యారెక్టర్ తర్వాత అంతే ఇదిగా మీరందరూ ఇష్టపడే పాత్రలో చేశాను. ఈ పాత్ర పొలిటీషియన్‌ గా చేసినా - అందుకోసం నేను ప్రత్యేకించి శిక్షణ తీసుకోలేదు డైరెక్టర్‌ కి ఏం కావాలో అదే చేశాను.. అని తెలిపింది. సర్కార్ కథ ఏదీ ఒక పార్టీని అనుసరించినది కాదు.. ఒక పొలిటీషియన్ కథ. ఓటింగ్ గురించి ఉంటుంది. ఎవరు తప్పుగా వోట్ చేశారు అని. ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. నేను చిన్నప్పుడు ఓటింగుకి వెళ్ళినప్పుడు ఏ సింబల్ బావుంటే దానికి ఓట్ వేశాను. సీరియస్‌ గా ఓటింగ్ గురించి ఓటు విలువ గురించి ఈ సినిమాలో చూపించారు.. అని వ‌రూ తెలిపింది.
   

Tags:    

Similar News