సీనియర్ యాంకర్ గా సుమ కనకాల ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. తనదైన అనుభవంతో ఎలాంటి సినిమా వేడుకను అయినా రక్తి కట్టించడం తన ప్రత్యేకత. ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షోల నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. టీవీ షోలకు హోస్టింగ్ చేస్తూ తన భర్త రాజీవ్ తో కలిసి పలు క్రేజీ షోలను నిర్మిస్తున్నారు. ఇక సుమ అడపాదడపా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించారు. తాజాగా సుమ నటించిన నాయికా ప్రధాన చిత్రం జయమ్మ పంచాయితీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ ఆదివారం ఉదయం టీజర్ విడుదలైంది. ఇది పల్లెటూరి నేపథ్యం ఉన్న సినిమా. ఆంధ్రా పల్లెల్లో సీన్ అంతా కనిపిస్తోంది. బుర్రకథను కూడా చూపించారు కాబట్టి కథాంశం కాస్త పాత కాలం నాటిదేనని భావించవచ్చు. అసలు ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఇలాంటి గొడవ జరిగి ఉండదు అని ఊరి పెద్దలు అంటున్నారు. ఇంతకీ జయమ్మ పంచాయితీ కథాకమామీషు ఏంటో కానీ అంటే.. కాస్త గడుసరిగానే వ్యవహరిస్తోంది. రెండ్రోజుల్లో తేల్చకపోతే పంచాయితీ ఉండదు పెద్దలు ఉండరు! అంటూ జయమ్మ గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. నీ దగ్గర డబ్బు ఎలా వసూలు చేయాలో తెలుసు! అంటూ ఒక పెద్దమనిషిని దబాయిస్తోంది. ఊళ్లో ఇళ్ల స్కీమ్ ల గురించి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేనా.. నీ మొగుడు మంచాన పడ్డాడు! అంటే.. నా మొగుడు నా మంచాన పడ్డాడు! అంటూ గడుసుగానే సమాధానమిచ్చింది. మొత్తానికి జయమ్మ వసూళ్ల పంచాయితీ కథేమిటో కానీ ఆసక్తిని కలిగిస్తోంది. చాలా సింపుల్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి కథను ఎంచుకుని పాత్రను హైలైట్ చేస్తూ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. టీజర్ దూసుకెళుతోంది. జయమ్మ పంచాయితీతో సుమ కొత్త జర్నీ ఆసక్తిని కలిగిస్తోంది. విజయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లో సుమ పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకున్నాయి. టీజర్ ని లాంచ్ చేసిన రానా స్పందిస్తూ అమ్మడియమ్మ జయమ్మ! అంటూ ప్రశంసలు కురిపించారు.
సుమ ప్రస్థానం ఆసక్తికరం:
టైమ్ చూసి టైమింగ్ లీ పంచ్ లు వేసే సుమ బుల్లితెర ప్రస్థానం ఆసక్తికరం. తన ప్రేమ పెళ్లి కూడా ఇంట్రెస్టింగ్. స్టార్ మహిళ- భలే చాన్సులే వంటి టీవీ కార్యక్రమాలతో చక్కని పేరు తెచ్చుకుని..అటుపై దేవదాస్ కనకాల డైరెక్టర్ చేసిన మేఘమాల సీరియల్ లో నటించి.. అక్కడ పరిచయమైన డైరెక్టర్ కొడుకు రాజీవ్ కనకాలను సుమ ప్రేమించి పెళ్లాడారు.
Full View