ఒక ప్రేమించుకుందాం రా.. ఇక బావగారు బాగున్నారా.. ఒక ప్రేమంటే ఇదేరా.. అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ఈ సినిమాల్ని రూపొందించిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ. ఒక టైంలో తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా వెలిగిన జయంత్.. తర్వాత వరుస ఫ్లాపులతో ఫేడవుట్ అయిపోయాడు. బాలకృష్ణతో చేసిన ‘అల్లరి పిడుగు’ తర్వాత ఆయన కనిపించకుండా పోయాడు. చాలా ఏళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘లవ్ ఆజ్ కల్’ రీమేక్ ‘తీన్ మార్’ చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాపవడంతో అడ్రస్ లేకుండా పోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జయంత్ ఇంకో సినిమాతో వార్తల్లోకి వస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా జయంత్ ఓ సినిమా మొదలుపెట్టడం విశేషం. ‘కాళహస్తి’ పేరుతో ఈ సినిమా ఈ రోజే ప్రారంభోత్సవం జరుపుకుంది. అనిల్ కుమార్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రాఘవేంద్రరావు.. దగ్గుబాటి సురేష్ బాబు లాంటి ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గంటా రవిని హీరోగా పరిచయం చేస్తారని రెండు మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమాల కోసం అతడికి అన్ని రకాల శిక్షణలూ ఇప్పించి రంగంలోకి దించుతున్నాడు గంటా శ్రీనివాసరావు. ఆయనకు సినీ రంగంతో మంచి పరిచయాలే ఉన్నాయి. కొడుకుని హీరోగా నిలబెట్టడానికి మంచి ఫ్లాట్ ఫామే రెడీ చేశారు. ఇంతకుముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను హీరోగా పరిచయం చేసింది జయంతే. మరి ప్రభాస్ లాగే.. రవి కూడా హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూద్దాం.