డార్క్‌ సినిమాతో వస్తున్నా-జయంత్‌

Update: 2015-08-10 05:59 GMT
ఒక సినిమాకి మరో సినిమాకి కథ పరంగా ఎలాంటి సంబంధం లేకుండా విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుని సినిమాలు చేయడం జయంత్‌.సి.ఫరాన్జీ కి అలవాటు. ప్రేమించుకుందాం రా, ఈశ్వర్‌, టక్కరి దొంగ, శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌, తీన్‌ మార్‌ .. ఇలా ఈ జాబితాని పరిశీలిస్తే ఆ సంగతి ఇట్టే అర్థమైపోతుంది. అయితే 2011లో తీన్‌ మార్‌ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో అతడు విరామం కోరుకుని సినిమాలకు దూరమయ్యాడు. ఈ సంగతిని తనే స్వయంగా చెప్పుకొచ్చారు. త్వరలోనే మరో ప్రయోగాత్మక కమర్షియల్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా జయంత్‌ చెప్పిన సంగతులివి....

=తీన్‌ మార్‌ తర్వాత నా సినిమాలపై నాకే బోర్‌ కొట్టింది. అందుకే విరామం తీసుకున్నా. ఎప్పటికప్పుడు నవ్యపంథా స్క్రిప్టు లతో సినిమాలు తీయాలన్నది నా ఆలోచన. అందుకోసమే ఈ గ్యాప్‌ తీసుకున్నా.

=లేటెస్టుగా ఓ డిఫరెంట్‌ సినిమా తీయాలని వస్తున్నా. ఇది డార్క్‌ మూవీ. డిపార్ట్‌ మెంట్‌ నుంచి సస్పెండ్‌ అయిన ఓ పోలీసాఫీసర్‌ కథ. బాగా తాగి పడిపోయే పోలీస్‌. అయితే అతడు సంఘం నుంచి వ్యభిచారాన్ని దూరం చేయాలనే పట్టుదలతో సిస్టమ్‌ కే వ్యతిరేకంగా వెళ్తాడు. ఇది ప్రయోగమే అయినా పూర్తి మసాలా కంటెంట్‌ ఉన్న సినిమా. అందరికీ నచ్చుతుంది. మార్టిన్‌ సార్సెరస్‌ తరహా చిత్రమిది.

=సినిమాలో మేకప్‌ ఉండదు. రొమాన్స్‌ కు నో ఛాన్స్‌, పాటలు అసలే ఉండవు. అయినా మసాలా ఆకట్టుకుంటుంది. జోనర్‌, నేపథ్యం ఆసక్తి రేకెత్తిస్తాయి. ఆర్ట్‌ ఫిలిం అస్సలు కానేకాదు.

=చైల్డ్‌ పోర్నోగ్రఫీ, వ్యభిచారం నేపథ్యంలో సినిమా తీస్తున్నానంటే పాటలు పెట్టలేను కదా! ఇది సంఘంలో బాధ్యతని ఆవిష్కరించాలి. స్టార్ల కోసం రాసుకునే కథాంశం కాదు. అనురాగ్‌ కశ్యప్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ చూస్తున్నప్పుడు కలిగే ఫీల్‌ కలగాలి. అందుకోసం లైటింగ్‌ లేని మేకప్‌ లేని సినిమా తీస్తున్నా. సెల్‌ ఫోన్‌ లో వీడియో షూట్‌ చేసి చూస్తే ఎలాంటి ఫీల్‌ కలుగుతుంది. అంత నేచురల్‌ గా సినిమా సాగుతుంది. అయినా మెప్పిస్తుంది.

Tags:    

Similar News