ఒక సినిమా హిట్ అయితే ఎక్కువగా హీరో ఇమేజ్ చాలా పెరుగుతుంది. హీరోయిన్ కి కూడా అవకాశాలు చాలా వస్తాయి. కానీ ఆ కథను తెరకెక్కించిన దర్శకుడికి మాత్రం వారికంటే కొంచెం తక్కువ ఇమేజ్ వస్తుంది. ఒకప్పుడు ఈ తరహాలో ఆలోచించే వారు బాగానే ఉన్నా ఇప్పట్లో దర్శకులకు కూడా అందరిలనే స్టార్ రేంజ్ ని అందుకుంటున్నారు. మంచి అవకాశాలను కూడా అందుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. హిట్స్ వచ్చినంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్క డిజాస్టర్ పడిందంటే మాత్రం దర్శకులు కోలుకోవడం చాలా కష్టం. ఎదో మ్యాజిక్ జరిగితే గాని అవకాశాలు రావు.
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రేమించుకుందాం రా.. ప్రేమంటే ఇదేరా.. శంకర్ దాదా MBBS వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ కెరీర్ మొదట్లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఎక్కువగా డిజాస్టర్స్ అందుకుంటూ అదృష్టం కొద్దీ మూడేళ్లకు ఒక సినిమాను చేస్తున్నారు. ఎప్పుడైతే తీన్ మార్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారో అప్పటి నుంచి ఆయన స్టార్ హీరోలతో సినిమా చేయడానికి అవకాశం రావడం లేదు. ఇక సినిమాలకి వీడ్కోలు పలికారు అనుకుంటున్న సమయాంలో రాజకీయ నాయకుల కొడుకులను అలాగే బిజినెస్ మెన్ కొడుకులను వెండితెరపై చూపిస్తున్నాడు.
ఆ మధ్యన జయదేవ్ సినిమాతో గంట రవి ని కొంచెం మంచి కథతో ఎంట్రీ ఇప్పించినా కథ అతనికి సెట్ అవ్వకపోవడంతో సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు నిలేష్ అనే యువ హీరోని పరిచయం చేస్తున్నాడు. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందట. నరేంద్ర అని టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఇటీవల పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఇక హీరోయిన్ గా లక్మే మోడల్ హంట్ ఫేమ్ ఇసాబెల్ కనిపించనుంది. ఒకప్పుడు దర్శకుడు జయంత్ టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలను చేశాడు. ఇప్పుడు కొత్త హీరోలను పరిచయం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. మరి ఈ రూట్ లో సక్సెస్ చూపించి మళ్లీ తన గత వైభవాన్ని చూపిస్తాడో లేదో చూడాలి. అసలు ఇలా కొత్తాళ్లను తెచ్చే కార్యక్రమం ఎందులకు చేపట్టారో జయంత్ వారే చెప్పావలయును!!