జయంత్ సి.పరాన్జీ ఈ పేరు విని చాలా కాలం అయ్యింది తెలుగులో. వెంకటేష్ ప్రేమించుకుందాం రా - బాహుబలి ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ ని డైరెక్ట్ చేసిన ఈయన అల్లరిపిడుగు - తీన్ మార్ సినిమాలుతో వరస పరాజయాలు చూశారు .దీనితో ఒక అడుగు వెనకకు వేసి రెట్టింపు వేగంతో మళ్ళీ మెగాఫోన్ పట్టారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ ‘జయదేవ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం త్వరలోనే విడుదలవుతోంది. “ఇక్కడ విజయం ఉంటేనే అవకాశం వస్తుంది. నాకు విజయం లేదు. అందుకే అవకాశం కూడా లేదు” అంటూ సంచలనంగా కామెంట్ చేశాడు జయంత్.
ఈ గ్యాప్ నాకు గుణపాఠం నేర్పిందంటూ.. ''ఎక్కడ పొరపాట్లు చేశానో పరిశీలించి, కారణాలు తెలుసుకున్నాను. అవి మళ్లీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నా. నేను ఎప్పుడు కథని బట్టే కథానాయకులను ఎంచుకుంటాను. ముందులాగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి తీస్తే సరిపోదు. ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. ఏ పెద్దహీరో ఉన్నా కథ కావాల్సిందే. కొత్తవాళ్లయినా కథే ముఖ్యం. అయితే స్టార్ హీరో ఉన్నప్పుడూ వాళ్ల ఇమేజ్, అభిమానుల అంచనాల్ని దృష్టిలో ఉంచుకొని సినిమా చేస్తా'' అని చెప్పాడు.
ఇప్పుడు ఉన్న టాప్ హీరోలు తో సినిమా తీయాలి అంటే మళ్ళీ “నేను మహేశ్ బాబుతో ఒక ప్రేమ కథ తీస్తా అని చెప్పారు. టక్కరి దొంగ కు నేనే డైరెక్టర్ నేనే ప్రొడ్యూసర్ ని కానీ మహేశ్ కు ఆ సినిమాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకు మహేశ్ కు ఎప్పుడు థాంక్స్ చెపుతూనే ఉంటాను. ఈ విషయంలో నాకు చాలా బాధనిపిస్తుంది. మహేశ్ ఎప్పుడు కలిసిన ఒక మంచి కథ సిద్దం చేయండి మళ్ళీ మనం కలిసి పని చేద్దాం అని చెబుతూ ఉంటాడు. ఇప్పుడు కథ సిద్దం చేసే పనిలో ఉన్నా. తొందరలో మా కాంబినేషన్లో ఒక మంచి ప్రేమ కథ వస్తుంది అని చెప్పగలను'' అంటూ ఆశాభావం వక్తం చేస్తున్నాడు జయంత్.
తమిళంలో విజయవంతమైన పోలీసు కథ ‘సేతుపతి’ ఆధారంగా జయదేవ్ చిత్రం తెరకెక్కింది. పరుచూరి వెంకటేశ్వరరావు స్క్రీన్ ప్లే చేశారు. మణిశర్మ స్వరాలు అందించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/