బిగ్ బాస్ 8 : హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్..?
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో పృధ్వి, నిఖిల్, యష్మి, నబీల్, ప్రేరణ ఉన్నారు
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో పృధ్వి, నిఖిల్, యష్మి, నబీల్, ప్రేరణ ఉన్నారు. వీరిలో శనివారం ఎపిసోడ్ అయ్యే సరికి నిఖిల్ సేఫ్ అయ్యాడు. ఇక ఆదివారం నాడు మిగిలిన నలుగురిలో నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన యష్మి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుని.
బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి నుంచి తన ఆట ఆడుతూ యష్మి ఆడియన్స్ ని అలరించింది. ఐతే మధ్యలో నిఖిల్ తో క్లోజ్ అవ్వడం వల్ల ఆమె ఆట దెబ్బ తిన్నది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి తనని నామినేట్ చేసి బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అన్న విషయాన్ని చెప్పారు. ఈ వారం నామినేషన్స్ లో కూడా ఎక్కువమంది యష్మినే చేశారు.
ఐతే యష్మితో పాటు నామినేషన్స్ లో ఉన్న మిగిలిన వారు కూడా స్ట్రాంగ్ అవ్వడం వల్ల హౌస్ నుంచి యష్మి వెళ్లిపోక తప్పలేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మి 12 వారాల జర్నీ ఆమె ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అందించింది. నిఖిల్ తో పాటు పృధ్వి, ప్రేరణతో కలిసి కాకుండా తన సొంతంగా ఆట ఆడి ఉంటే కచ్చితంగా యష్మి టాప్ 5 దాకా ఉండే అవకాశం ఉండేది. కానీ ఆమె నిఖిల్ వల్ల గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది.
యష్మి ఫ్యామిలీ వీక్ లో ఆమె తండ్రి వచ్చి ఆమెకు బయట ఏం జరుగుతుందో కాస్త చెప్పాడు. ఇక ఆ వీకెండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి నిఖిల్ కు కొంత బూస్టింగ్ ఇచ్చారు. ఐతే తన ఫ్రెండ్ వచ్చి ఆఫ్టర్ 6 యష్మి చేసే పనుల గురించి చెప్పడం వల్ల కొందరు దాన్ని నెగిటివ్ గా తీసుకున్నారు. యష్మి కి వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతం తో ఫైట్ కూడా ఆమెను ఎలిమినేట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.
బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మి ఎలిమినేషన్ ప్రేరణకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కచ్చితంగా హౌస్ లో యష్మి ఎలిమినేషన్ వల్ల ప్రేరణ, నిఖిల్, పృధ్వి లకు ఎఫెక్ట్ పడేలా చేస్తుంది.