డైలాగ్ కింగ్ ను పొగిడేసిన ముద్దుగుమ్మలు

Update: 2016-09-17 16:27 GMT
వైజాగ్ లో జరిగిన మోహన్‌ బాబు 40వ సంవత్సరాలు సినీ పండుగ చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పొచ్చు. ఈ సందర్భంగా ముగ్గురు ముద్దగుమ్మలు శ్రీదేవి - జయప్రద - జయసుధ తమ అభినందనమాలతో మోహన్ బాబును ఆశ్చర్యపరిచారనే చెప్పాలి. టి సుబ్బిరామిరెడ్డి ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమంలో ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు ఏమన్నారో చూద్దాం పదండి.

''మోహన్ బాబు ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఒక పొలిటీషియన్ గా ఒక ఎడ్యుకేషనిస్ట్ గా.. అంతకంటే మించి అందరి మంచినీ కోరుకునే ఒక మంచి స్నేహితుడుగా ఆయన ఒక గొప్ప వ్యక్తి. రానున్న తరాలకు ఆయన ఒక మంచి ఇనిస్పిరేషన్ అవుతారు. ఇలాంటి ఫంక్షన్ కు పిలిచి గౌరవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు'' అంటూ అచ్చ తెలుగులో సీనియర్ అందాల తార శ్రీదేవి మాట్లాడుతుంటే వినడానికి ఎంతో బాగుంది.

ఇక మరో హీరోయిన్ జయప్రద కూడా అలాగే మాట్లాడింది. ''నీలాంటి అందమైన ఆడపిల్లను నేను ఎక్కడా చూడలేదమ్మా అంటుంటారు మోహన్ బాబు. అది నిజమో కాదో నాకు తెలియదు కాని.. ఆయన నాకు అలాంటి ఓ గౌరవం ఇవ్వడం చెప్పుకోదగిన విషయం'' అంటూ జయప్రద డైలాగ్ కింగ్ ను ఆకాశానికి ఎత్తేశారు. అలాగే జయసుధ మాట్లాడుతూ.. ''నాకు తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా రానప్పుడు ఆ వత్తులూ పొల్లులూ ఎలా పలకాలని ఆయన సెట్లో నేర్పించేవారు. ఆ తరువాత మా కాంబినేషన్లో సూపర్ హిట్లు వచ్చాయి'' అంటూ మోహన్ బాబు గురించి మరో ముద్దుగుమ్మ జయసుధ తెలిపారు.

Tags:    

Similar News