దివంగత ఎన్టీఆర్ మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి దాకా అందరి సినిమాల్లో మరపురాని పాత్రలు ఎన్నో వేసిన ఎవర్ గ్రీన్ హీరొయిన్ జయప్రద 90 దశకం తర్వాత సినిమాలు బాగా తగ్గించుకున్నారు. అడపాదడపా ఒకటి రెండు చేసినప్పటికీ రాజకీయాల్లో పూర్తి బిజీ కావడంతో మళ్ళి ఇటువైపు వచ్చే ఆలోచన చేయలేదు. ఇన్నాళ్ళ తర్వాత ఒక నిఖార్సైన కంటెంట్ ఉన్న ద్విబాషా చిత్రంతో సౌత్ ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే మలయాళంలో ‘కినర్’ తమిళ్ లో ‘కెని’ పేరుతో రూపొందుతున్న మూవీ. నిశద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సరిహద్దు రాష్ట్రాల్లో ఉండే నీటి సమస్యను ఆధారంగా రూపొందుతోంది. ఇందులో తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకున్న కేరళ మహిళగా జయప్రద చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. తను మాత్రమే కాకుండా ఇందులో నాజర్ - రేవతి - రేఖ - పార్తిబన్ - అర్చన లాంటి నిన్నటి తరం సీనియర్ యాక్టర్లు నటిస్తున్నారు.
జయప్రద గారిది ఇందులో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ పాత్ర. ప్రజలతో మమేకమై ఉండే నిజమైన రాజకీయ నాయకురాలిగా తనకున్న అనుభవం ఈ సినిమాకు అద్భుతంగా ఉపయోగపడింది అంటున్న జయప్రద ఇది సౌత్ లో తనకు సరైన రీ ఎంట్రీ అని చెబుతున్నారు. ప్రకృతి ఇచ్చిన నీటిపై ఎవరికి హక్కులు ఉండవు, అందరికి సమానంగా అందాలనే కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రాల మధ్య తీవ్ర చిచ్చు పెడుతున్న కృష్ణా, కావేరి జలాల మీదే ఉంటుందని టాక్.
ఇందులో మరో విశేషం కూడా ఉంది. 27 ఏళ్ళ క్రితం దళపతి సినిమా కోసం కలిసి పాడిన ఎస్పి బాలసుబ్రమణ్యం, యేసుదాసు తిరిగి ఇప్పుడు ఈ సినిమా కోసం ‘అయ్యా సామీ’ అంటూ గొంతు కలిపారు. ఇటీవలే విడుదలైన ఈ వీడియో సాంగ్ యు ట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. జయచంద్రన్ సంగీత దర్శకుడు. ఇన్ని విశేషాలు, ఇందరు సీనియర్ నటీనటులు కలిసి నటిస్తున్న కెని తెలుగు వెర్షన్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Full View