ఫ్యూచర్‌ లో కేవలం నిర్మాతగానే యాంకర్‌

Update: 2016-04-06 13:30 GMT
వెండితెరపై అదృష్టం పరీక్షించుకోవాలని బుల్లితెర యాంకర్లకు చాలానే కోరిక ఉంటుంది. ఇందులో కొంతమందికే అవకాశాలొస్తాయి. ఆ వచ్చినవారిలో అతి కొద్ది మందే సక్సెస్ అవుతారు. రీసెంట్ గా అనసూయ - రష్మీలు బుల్లితెర నుంచి వెండితెరకి వచ్చి హిట్లు కొట్టగలిగారు. ఇప్పుడు మరో యాంకర్ సినిమాల్లో తన అదృష్ణం పరీక్షించుకుంటోంది. జెమిని మ్యూజిక్ ఛానల్ లో వెన్నెల అనే కార్యక్రమంతో టెలివిజన్ ప్రేక్షకులకు జయతి పరిచితురాలే.

ఇప్పుడీమె లచ్చి అనే టైటిల్ పై తెరకెక్కిన ఓ చిత్రంతో తెరంగేట్రం చేయనుంది. తనకు చాలా కాలం నుంచి సినిమా ఆఫర్లు వస్తున్నా.. అంతగా ఇంట్రెస్ట్ లేక వద్దని అనుకుందట ఈ యాంకర్. యాక్టింగ్ కంటే ప్రొడక్షన్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో.. ఈ రంగాన్ని పట్టించుకోలేదంటోంది. నిర్మాణంపై ఆసక్తితో.. మలయాళ మూవీ మై బాస్ కు రీమేక్ రైట్స్ కూడా కొనేశానంటోంది లచ్చి.. అదే జయతి. కానీ ఈ లచ్చి స్టోరీతో వచ్చిన డైరెక్టర్ చెప్పిన తీరు, కథ నచ్చడం, తనే హీరోయిన్ గా చేయాలని పట్టుబట్టడంతో ఒప్పుకున్నానని చెప్పిందీ యాంకర్. ఇదో థ్రిల్లింగ్ హారర్ కామెడీ కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసి, సమ్మర్ లో లచ్చిని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జయతి చెబుతోంది. అయితే.. ఫ్యూచర్ లో మాత్రం హీరోయిన్ గా కంటిన్యూ అవనని.. నిర్మాతగానే ఉంటానని అంటోంది జయతి.
Tags:    

Similar News