కాస్తో కూస్తో మంచి అంచనాలతోనే వచ్చిన దొరసాని ఫైనల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. బాగా తెలిసిన కథను కేవలం తెలంగాణ నేపధ్యం అనే పాయింట్ ని జోడించి మరాఠి సైరాత్ ను రీమేక్ చేసిన తీరు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓ వర్గం దీనిలో చూపించిన బ్యాక్ డ్రాప్ గురించి బాష గురించి గొప్పగా చెప్పుకున్నా ఫైనల్ గా థియేటర్ కు వచ్చి చూసే సినిమా కాదని కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. చాలా చోట్ల తీసికట్టుగా ఉండగా బిసి సెంటర్స్ లో రెండో వారం రాకుండా డెఫిసిట్ మొదలైపోయింది.
ప్రమోషన్ ని స్టడీగానే చేస్తున్నా వసూళ్లు మాత్రం పెరగడం లేదు. తాజాగా సెలబ్రిటీల కోసం మరోసారి షో వేసిన దొరసాని టీమ్ ప్రెస్ మీట్ లో నటి కం హీరోయిన్ శివాత్మిక తల్లి జీవిత రాజశేఖర్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలో ఆనంద్ దేవరకొండ శివాత్మిక చాల గొప్పగా నటించారని కానీ కొందరు క్రిటిక్స్ సోషల్ మీడియాలో ట్రాలర్స్ రిలీజ్ కు ముందు ఇద్దరినీ టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడిదాకా బాగానే ఉంది కానీ ఆవిడ అన్న మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఆనంద్ నటన బాగాలేదు అన్నవాళ్ళు సైకోలని లేదా అంతకు మించి అని అర్థం వచ్చేలా చెప్పడం మాత్రం విడ్డూరం. నిజానికి ఆనంద్ గొప్పగా నటించిందే లేదు. అన్న విజయ దేవరకొండ గొంతులో సారూప్యత తప్పితే వాహ్ భలే చేశాడు అనిపించే సీన్ సినిమాలో లేదు. అందుకే కామెంట్స్ కూడా ఎక్కువగా వచ్చాయి. కానీ అలా అన్నంత మాత్రాన వాళ్లందరిని సైకోలు అనేయడం భావ్యంగా లేదు. మొదటి సినిమాకే ఎవరూ అద్భుతాలు చేయరు. కాస్త టైం ఇవ్వాలి. ఇలా ఏమి అనకూడదు అనే శైలిలో మాట జారటం కరెక్ట్ కాదేమో