పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని మెగాస్టార్ చిరంజీవిని దేవుళ్లుగా భావించే బండ్ల గణేష్ వీరావేశం గురించి తెలిసినదే. మెగాహీరోలను పొలిటికల్ గా జీవిత పదే పదే విమర్శించిన సందర్భాల్ని గుర్తు చేసుకుని ఆయన నేడు ఎమోషన్ అయిన తీరు `మా` అసోసియేషన్ 950 మంది సభ్యుల్లో చర్చకు వచ్చింది. అక్టోబర్ 10న జరగనున్న `మా` ఎన్నికలు అంతకంతకు వేడెక్కిస్తున్న వేళ `బండ్ల వర్సెస్ జీవిత` ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. అయితే మెగా అండదండలతో బరిలో దిగుతున్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై తనకు సభ్యత్వం దక్కకపోగా అందులో జీవిత రాజశేఖర్ పోటీ చేయడాన్ని బండ్ల జీర్ణించుకోలేకపోతున్నారు.
తన దేవుళ్లను కించపరిచిన జీవితను ప్యానెల్ లోకి ఆహ్వానించడమేమిటని బండ్ల అలిగారు. తీవ్రంగా హర్టయి ప్యానెల్ లో తనకు అప్పగించిన బాధ్యతలనుంచి వైదొలిగారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జీవిత జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు కాబట్టి పట్టుబట్టి ఇండివిడ్యువల్ గా అదే పదవికి తాను కూడా పోటీపడతానని బండ్ల ప్రకటించారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఇంతకీ జీవిత రాజశేఖర్ ఏమన్నారు? అంటే .. తాజా మీడియా మీట్ లో జీవిత ఎంతో కూల్ గా తెలివిగా స్పందించారు. బండ్ల గణేష్ లా ఆవేశానికి పోకుండా కూల్ గా మాటకారితనం చూపించారు. తనకు బండ్ల గణేష్ కి మధ్య విభేధాలు ఏవీ లేవని తాను కూడా `మా`కు సేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి పోటీకి దిగుతున్నారని అది తప్పేమీ కాదని అన్నారు. అయితే ఏ కారణం వల్ల బండ్ల తప్పుకున్నానని చెప్పారో దాని గురించి నామ మాత్రంగా అయినా జీవిత ప్రస్థావించకపోవడం గమనార్హం. ``నాకు వ్యతిరేకంగానో నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా కలిసే పనిచేస్తాం. గెలచినా ఓడినా అసోసియేషన్ కోసం పనిచేస్తాం`` అని జీవితా రాజశేఖర్ అనడం కొసమెరుపు. మేమంతా ఒకటే అంటూ ఒకరికొకరు వ్యతిరేకంగా రాజకీయాల్ని నడపడం పోటీపడడం ఫక్తు మైండ్ గేమ్ నే తలపిస్తోంది.