ఉహూ... రాజశేఖర్ చేయట్లేదు

Update: 2018-03-31 04:35 GMT
ఎన్టీఆర్ - రామ్ చరణ్ తేజ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ మూవీ షూటింగ్ మొదలు కావడానికి ముందు నుంచే బోలెండత క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో హీరోలిద్దరూ తప్ప మిగతా కాస్టింగ్ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ ఏం రాలేదు. దీంతో దీనికి సంబంధించి బోలెడు గాసిప్స్ వచ్చేస్తున్నాయి.

సీనియర్ హీరో రాజశేఖర్ మల్టీస్టారర్ మూవీలో పాత్ర చేయబోతున్నాడనే టాక్ తాజాగా వినిపిచింది. యాంగ్రీ మేన్ క్యారెక్టర్లకు పెట్టింది పేరయిన రాజశేఖర్ కెరీర్ కు ఓ రోల్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలామంది భావించారు. కానీ రాజశేఖర్ భార్య జీవిత ఈ టాక్ ను కొట్టిపారేసింది. విలన్ గా నటించాలంటూ రాజమౌళి నుంచి తమకు ఎలాంటి ఆఫర్ రాలేదని తేల్చి చెప్పేసింది. తమ కుమార్తె శివాని సినిమా లాంచింగ్ ఈవెంట్ కు రావాల్సిందిగా రాజమౌళిని కలిసి ఆహ్వానించామని.. దాంతో ఈ టాక్ వచ్చి ఉంటుందని జీవిత అంటోంది.

రాజమౌళి సినిమాల్లో హీరోల తరవాత అంత పేరొచ్చేది విలన్లకే. జక్కన్న డైరెక్షన్ లో విలన్లుగా నటించిన వారిలో చాలావరకు ఇండస్ట్రీలో సూపర్ గా క్లిక్ అయ్యారు . దీంతో మల్టీస్టారర్ మూవీలో విలన్ ఎవరనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువగానే ఉంది. ఒకవేళ తరవాత రాజమౌళి ఆఫర్ చేసి.. రాజశేఖర్ ఈ రోల్ చేస్తే మాత్రం కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త ఫీల్ రావడం మాత్రం ఖాయం. అంటే #RRRలో. ఈ 'R' కేవలం రూమరే అనమాట.
Tags:    

Similar News