అజ్ఞాతవాసి మీద యాక్షన్ తీసుకుంటారట

Update: 2018-01-19 04:38 GMT
అజ్ఞాతవాసి మూవీ రిజల్ట్ గురించి పదేపదే చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. కానీ ఈ చిత్రాన్ని సమస్యలు ఇంకా వదిలిపెట్టేటట్లుగా లేవు. ముఖ్యంగా అజ్ఞాతవాసిని ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ కు కాపీ అనే ప్రచారం ముందు నుంచి జరిగింది. సినిమా చూసిన తర్వాత ఇది నిజమే అని తేలిపోయింది.

అజ్ఞాతవాసి పై లార్గోవించ్ దర్శకుడు ముందు నుంచి ఓ కన్నేసి ఉంచాడు. చూడాలని అనుకుంటున్నట్లుగా ఓ సారి.. చూసిన తర్వాత ప్లాట్ దగ్గరగా ఉందని మరోసారి.. టీసిరీస్ తో సెటిల్మెంట్ చాలదేమో అంటూ ఇంకోసారి వరుసగా ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు జెరోమ్ సల్లే.  ఇప్పుడీయన దగ్గర నుంచి మరో బాంబ్ పేలింది. 'కాపీ చేయకుండానే క్రియేటివిటీ చూపించగల ట్యాలెంట్ ఇండియన్ సినిమాకు ఉంది. వారం రోజులుగా అజ్ఞాతవాసి టీం సైలెంట్ గా ఉండడం విసిగిస్తోంది. అందుకే లీగల్ నోటీస్ రూపంలో యాక్షన్ తీసుకునేందుకు రెడీ' అన్నాడు ఈ దర్శకుడు.

అజ్ఞాతవాసి గ్రాండ్ రిలీజ్ కావడంతో.. తన ఫ్లాప్ సినిమా ద్వారా మళ్లీ అంతో ఇంతో పిండుకోవాలని ఈ దర్శకుడు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అది ఆయన సొంత ప్రొడక్టే అయినా.. ఆత్రపడి అసలు పాయింట్ మర్చిపోయినట్లుగా ఉన్నాడు. లార్గో వించ్ ను ఇండియన్ లాంగ్వేజెస్ లో రూపొందించే రైట్స్ టీ-సిరీస్ కు ఎప్పుడో అమ్మేశారు. అందుకే అజ్ఞాతవాసి టీం ఆ కంపెనీతో కాస్ట్ లీ సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని టాక్.

అయితే.. ఇండియాలో మాత్రమే రిలీజ్ చేయలేదు కాబట్టి.. యాక్షన్ తీసేసుకోవచ్చు అనుకోవడం లార్గోవించ్ దర్శకుడి అత్యాశే కావచ్చు. అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినా.. అది పక్కా తెలుగు సినిమానే. అయినా.. ఈయన తీసిన ఫ్రెంచ్ మూవీని., కేవలం ఫ్రాన్స్ లో రిలీజ్ చేసుకుంటాడా.. ఇతర దేశాల్లో రిలీజ్ చేయడా!
Tags:    

Similar News