రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ ఏడాది లైగర్ సినిమాతో ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా అతని కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అత్యంత దారుణమైన నష్టాలను కలిగించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అయితే మళ్ళీ లైగర్ సినిమా నుంచి కోలుకునేందుకు విజయ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక అతని తదుపరి సినిమాలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి అనే విధంగా ప్రమోషన్స్ కూడా చేయాలని అనుకుంటున్నాడు. సమంతతో చేస్తున్న ఖుషి సినిమాకు మధ్యలో కొంత బ్రేక్ పడిన విషయం తెలిసిందే. సమంత ఇంకా అస్వస్థత నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ సినిమా షూటింగ్ మళ్లీ కొనసాగించే కంటే ముందే విజయ్ దేవరకొండ మరొక కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు.
జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా అనుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టు ప్లాన్ ప్రకారం అయితే 2023 సమ్మర్లో మొదలు కావాలి. కానీ ఇప్పుడు ఖుషి సినిమాకు బ్రేక్ పడడంతో దేవరకొండ గౌతమ్ తో తొందరగా స్టార్ట్ చేద్దామని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇక దర్శకుడు కూడా పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకుని ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే 2023 జనవరిలోనే మొదలు కాబోతుందట.
ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. అలాగే అతనికి మరికొన్ని కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు గత ఏడాదిలోనే అతను క్లారిటీ ఇచ్చాడు.
అలాగే హరీష్ శంకర్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక బాలీవుడ్ కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో సైతం రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడు. మరి ఆ సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.