తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ ''జెర్సీ'' చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా మారడంతో.. 2021 డిసెంబర్ 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
హిందీ 'జెర్సీ' చిత్రాన్ని అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు - సూర్యదేవర - బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో షాహిద్ కపూర్ తో పాటుగా చిత్ర దర్శక నిర్మాతలు హాజరయ్యారు.
ట్రైలర్ విషయానికొస్తే.. జీవితాన్ని గడపడానికి కష్టపడుతున్న ఒక మాజీ క్రికెటర్.. జెర్సీని పొందాలనే తన బిడ్డ కోరికను తీర్చాలని అనుకుంటాడు. అయితే ఈ క్రమంలో అతను గతంలో వదిలేసిన క్రికెట్ బ్యాట్ ను పట్టుకోవాల్సి వస్తుంది. మధ్యలో వదిలేసిన తన లక్ష్యాన్ని ఈసారైనా నెరవేర్చుకున్నాడా? లేక జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగానే మిగిలిపోతాడా? చివరకు తన కొడుక్కి జెర్సీ అందించాడా? అనేది తెలియాలంటే 'జెర్సీ' సినిమా చూడాల్సిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భావోద్వేగాలు కలబోసి ఈ చిత్రాన్ని రూపొందించారు.
కాకపోతే ట్రైలర్ చూస్తుంటే తెలుగు 'జెర్సీ' లో ఎక్కువ మార్పులు చేయకుండా సీన్ టూ సీన్.. డైలాగ్ టూ డైలాగ్ మాతృకను ఫాలో అయినట్లు అనిపిస్తోంది. నాని అద్భుతంగా పోషించిన పాత్ర కాబట్టి షాహిద్ కపూర్ తో కచ్చితంగా కంపెరిజన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన రైల్వే స్టేషన్ లో ఎమోషనల్ అయ్యే సీన్ లో ఎవరి నటన బాగుందని అప్పుడే నెటిజన్స్ చర్చించడం మొదలుపెట్టారు. అయితే ఇందులో క్రికెటర్ గా కనిపించాడానికి షాహిద్ చాలా కష్టపడ్డాడు. క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది.
'జెర్సీ' చిత్రంలో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పొషించారు. తెలుగులో నటించిన పిల్లాడే హిందీలోనూ హీరో తనయుడి పాత్రలో కనిపించారు. సాచెట్ & పరంపర సంగీతం సమకూర్చగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'గజినీ' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా కావడంతో హిందీ 'జెర్సీ' మీద తెలుగు జనాల దృష్టి కూడా పడింది. 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్ కపూర్.. 'జెర్సీ' రీమేక్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
Full View