రజినీతో జెట్ లీ? తూచ్.. ఉత్తినే..

Update: 2015-12-31 12:07 GMT
సొతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కబాలి చిత్రం.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఓ మాఫియా డాన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ స్టోరీలో.. విలన్ కేరక్టర్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కిడ్నాప్ డ్రామా ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని చెబ్తున్నారు. అయితే.. కబాలిలో రజినీకాంత్ కు విలన్ గా ఇంటర్నేషనల్ స్టార్ జెట్ లీ నటిస్తున్నాడనే వార్తలు ఈమధ్య హల్ చల్ చేశాయి.

కానీ ఇవన్నీ రూమర్స్ అని తేల్చేశారు కబాలి మేకర్స్. నిజానికి రజినీకాంత్ కి అపోజిట్ గా వచ్చే ఈ పాత్రను స్ట్రాంగ్ గా తీర్చిదిద్దేందుకు.. ఇంటర్నేషనల్ స్టార్ ను తీసుకుందామని అనుకున్న విషయం మాత్రం నిజమేనని చెబుతున్నారు. ఏఅయితే.. జెట్ లీ ని ఫైనల్ చేశారనే వార్తలను మాత్రం కాదని చెప్పేశారు. అసలు జెట్ లీ తో ఈ విషయంపై మాట్లాడను కూడా మాట్లాడలేదట. జస్ట్ తాము అనుకుంటున్న దానికి. కల్పనలు చేర్చి రూమర్స్ పుట్టించారని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో ఎక్కువ భాగం మలేషియాలో జరగనుండడం కూడా.. అంతర్జాతీయ స్టార్ ను తీసుకోవాలనే ఆలోచనకు కారణంగా చెబుతున్నారు. అయితే.. తమ ఆలోచనలు కార్యరూపం దాల్చలేదని ఫైనల్ చేసేశారు నిర్మాతలు.

కబాలి మూవీలో రజినీ కాంత్ కు జంటగా.. రాధికా ఆప్టే నటిస్తుండగా.. పీఏ రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. 2016 ఏప్రిల్ 14 న రిలీజ్ చేయనున్నారు. లింగ ఫ్లాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. కబాలిపై రజినీ ఫ్యాన్స్ బోలెడు హోప్స్ పెట్టుకున్నారు.
Tags:    

Similar News