ఆ లక్కీ ఛాన్స్ బెల్లంకొండకే దక్కనుందా?

Update: 2021-01-03 03:30 GMT
అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పటికి ఎప్పటికి కోట్లాది మంది అభిమాన హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు. సౌత్‌ నుండి ఉత్తరాది వెళ్లి అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా యావత్‌ ఇండియన్‌ సినీ ప్రేమికులను ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసిన శ్రీదేవి ఆల్‌ టైమ్ ఫేవరేట్‌ హీరోయిన్‌ గా మారిపోయారు. అలాంటి దివంగత శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్‌ ను టాలీవుడ్‌ కోలీవుడ్ లో నటింపజేసేందుకు చాలా మంది మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు యంగ్‌ స్టార్స్‌ కూడా ఆమెతో నటించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి తో నటించే అవకాశం ఎలాగూ రాదు కనుక ఆమె కూతురుతో అయినా నటించే అవకాశం వస్తే అంతకు మించిన అదృష్టం ఏమీ లేదు అన్నట్లుగా యంగ్‌ హీరోలు ఆమె వైపు చూస్తున్నారు.

సౌత్‌ సినిమాలపై ఆమె అంతగా ఆసక్తి చూపించడం లేదు. హిందీ సినిమాలతోనే బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కు ఈ అమ్మడు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. చత్రపతి సినిమాను బెల్లంకొండ హిందీలో రీమేక్‌ చేయబోతున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందబోతున్న చత్రపతి రీమేక్‌ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ తో సంప్రదింపులు జరుపుతున్నారు. భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతో పాటు సూపర్‌ హిట్‌ రీమేక్‌ అది కూడా హిందీలో అవ్వడం వల్ల జాన్వీ ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఒరిజినల్‌ వర్షన్ లో శ్రియ నటించిన విషయం తెల్సిందే. మరి శ్రియ పాత్రను జాన్వి ఏ మేరకు రిప్లేస్ చేయగలదు అనేది చూడాలి.
Tags:    

Similar News