ముక్కు కోయించేసుకున్న శ్రీదేవి డాటర్?

Update: 2017-07-04 04:34 GMT
బాలీవుడ్ లో దశాబ్దకాలంపైగా అగ్ర తార స్థానంలో వెలిగిపోయిన శ్రీదేవి.. ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని కొన్నేళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు మామ్ అంటూ ఓ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ చేసేస్తోంది. మరికొన్ని రోజుల్లో మామ్ విడుదల కానుండగా.. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్.. అమ్మను ఫుల్లుగా ఫాలో అయిపోతోందని అంటున్నారు.

చాలా విషయాల్లో శ్రీదేవి పోలుకలు ఉన్న జాన్వి.. ఇప్పుడు ముఖ కవళికల విషయంలోనూ అమ్మను అనుసరిస్తోందట. ఇందుకు సాక్ష్యంగా ఆమె ఫోటోలనే చూపిస్తున్నారు నెట్ జనాలు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది జాన్వి. కొంతకాలం క్రితం ఈమె ఫోటోల్లో.. జాన్వి ముక్కు కాసింత లావుగా ఉంటుంది. కానీ ఇప్పటి ఫోటోలను చూస్తే మాత్రం.. కోసి కట్ చేసి పెట్టినట్లు చాలా షార్ప్ గా ఆమె నోస్ కనిపిస్తుంది. సర్జరీ చేయించుకుని ముక్కు అందాన్ని మరింతగా పెంచేసుకుందని నెటిజన్లు అంటున్నారు.

అప్పట్లో శ్రీదేవి కూడా ఇలాగే ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అందంగా కనిపించేందుకు అచ్చు అమ్మ ప్లే చేసిన ట్రిక్స్ అన్నిటినీ అచ్చంగా దత్తత తీసేసుకుని ఆచరిస్తున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పై.. బాలీవుడ్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. మరాఠీ బ్లాక్ బస్టర్ మూవీ సైరత్ హిందీ రీమేక్ తో ఈమె తెరంగేట్రం చేయనుందని బాలీవుడ్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News