శ్రీదేవి కూతురికి ఆ రీమేక్ ఫిక్స్

Update: 2017-06-01 04:49 GMT
గత తరానికి అందాల తార శ్రీదేవి అయితే.. ఈ జనరేషన్ ను అలరించేందుకు ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ సినిమాల్లోకి రానుందనే న్యూస్ చాలాకాలంగా వినిపిస్తూనే ఉంది. రెండేళ్ల నుంచి రకరకాల ప్రాజెక్టుల్లో జాన్వి పేరు వినిపించింది. ఇప్పటివరకూ ఏ విషయాన్ని శ్రీదేవి నుంచి మాత్రం కన్ఫర్మేషన్ రాలేదు.

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. స్టార్ కిడ్ జాన్వి కపూర్ ను లాంఛ్ చేయడం అయితే ఖాయమే. అయితే ఇందుకు మరాఠీ మూవీ సైరత్ రీమేక్ ను ఎంచుకున్నారని గతేడాది వార్తలు వచ్చాయి. సునీష్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి.. షాహిద్ కపూర్ కి వరుసకు తమ్ముడు  అయ్యే ఇషాన్ ఖట్టర్ లలో ఒకరిని హీరోగా తీసుకుంటారని అన్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు దాదాపు ఫైనల్ అయినట్లే అని తెలుస్తోంది. సైరత్ రీమేక్ కు శ్రీదేవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. హీరో విషయంలో కూడా ఇషాన్ ఖట్టర్ కే మొగ్గు చూపిందట శ్రీదేవి ఫ్యామిలీ.

ఇప్పటికే కొన్ని సార్లు జాన్వి కపూర్- ఇషాన్ ఖట్టర్ కలిసి చక్కర్లు కొడుతూ మీడియా కంటబడ్డ సంగతి తెలిసిందే. ఇక ఈ హిందీ సైరత్ ను కరణ్ జోహార్ నిర్మించనుండగా.. రీసెంట్ గా బద్రీగానాథ్ కీ దుల్హనియా అంటూ బ్లాక్ బస్టర్ కొట్టిన శశాంక్ ఖేతాన్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై శ్రీదేవి నోటి వెంట అధికారికమైన ప్రకటన రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News