త్రివిక్రమ్ లేకుండా జిలేబితో సెకండ్ ఇన్నింగ్స్

Update: 2022-10-07 04:15 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట్లో ఎక్కువగా కె విజయభాస్కర్ అనే దర్శకుడు తోనే సినిమాలు చేశాడు. ఆయన దగ్గరే రచయితగా కొన్నాళ్లపాటు చాలా బిజీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన త్రివిక్రమ్ కు మంచి గుర్తింపు లభించింది. అవకాశాల కోసం చాలా ప్రయత్నం చేస్తున్న సమయంలో అతని దర్శకత్వంలోనే స్వయంవరం అనే సినిమా ద్వారా మొదటి అవకాశం వచ్చింది.

ఇక ఆ సినిమా అనంతరం విజయభాస్కర్ ఆ తర్వాత త్రివిక్రమ్ ను అసలు వదిలిపెట్టలేదు. త్రివిక్రమ్ రైటర్ గా కంటిన్యూగా వరుసగా ఛాన్స్ లు అందుకున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన నువ్వే కావాలి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన నువ్వు నాకు నచ్చావు మన్మధుడు మల్లీశ్వరి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో లాభాలను అందించాయి. కేవలం త్రివిక్రమ్ విజయభాస్కర్ కాంబినేషన్ అంటే చాలు అప్పట్లో మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉండేది.

నాగార్జున వెంకటేష్ వరుస విజయాలు అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఇద్దరితో  జై చిరంజీవ అనే సినిమా చేశారు. కానీ అది అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఇద్దరి కలయికలో సినిమా అయితే రాలేదు. అయితే మన్మధుడు సినిమా టైమ్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. ఏదో మెగాస్టార్ కోరిక మేరకు అప్పుడు జై చిరంజీవ సినిమాకు రచయిత గ వర్క్ చేశాడు. ఇక తరువాత మాత్రం విజయభాస్కర్ తో అతను కలవలేదు.

అయితే త్రివిక్రమ్ మిస్ అయిన తర్వాత విజయభాస్కర్ కు సరైన విజయాలు మాత్రం దక్కలేదు. ఆ తర్వాత సుమంత్ తో చేసిన క్లాస్ మెట్స్, అలాగే తరుణ్ తో చేసిన భలే దొంగలు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలకు త్రివిక్రమ్ స్నేహితుడు అబ్బూరి రవి రచయితగా వర్క్ చేశాడు. ఆ తర్వాత ఆది సాయికుమార్ తో విజయ భాస్కర్ ప్రేమకావాలి అనే సినిమా చేశాడు. ఆ సినిమాకు తన రచయినలోనే దర్శకత్వం వహించాడు.

ఆ సినిమా హిట్ అయిన తర్వాత విజయ భాస్కర్ రామ్ పోతినేని వెంకటేష్ తో మసాలా సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ లేకుండా మరోసారి రీ ఎంట్రీ ఇస్తున్నారు. జిలేబి అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న విజయభాస్కర్ కొత్త కుర్రాడు శ్రీ కమల్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. జీవిత రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా ఓపెనింగ్ ఇటీవల జరుగగా త్రివిక్రమ్ ప్రత్యేకత అతిథిగా పాల్గొన్నారు ఒక విధంగా తన గురువు సక్సెస్ అందుకుని ట్రాక్లోకి రావాలని కూడా కోరుకున్నాడు. మరి జిలేబి అనే సినిమాతో విజయభాస్కర్ గతంలో మాదిరిగా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News