జోన‌ర్ ఒకే ..మ‌రి స‌క్సెస్ మాటేంటి భామ‌లు!

Update: 2022-08-26 23:30 GMT
సౌత్ నుంచి కీర్తి సురేష్...నార్త్ నుంచి తాప్సీ అన్ని జాన‌ర్ల‌ని ట‌చ్ చేస్తున్నారు. జాన‌ర్ ప‌రంగా చూస్తే అన్ని జాన‌ర్ల‌లో సినిమా చేస్తున్న భామ‌లు వీరిద్ద‌రిగానే  తేలింది. ఓ వైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే..మ‌రోవైపు లేడీ ఓరియేంటెడ్ స‌హా డిఫ‌రెంట్ అటెంప్స్ట్  చేస్తున్న నాయిక‌లుగా ఇద్ద‌రి పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

కెరీర్ ఆరంభం స‌హా 'మ‌హాన‌టి' విజ‌యం నేప‌థ్యంలో గ్లామ‌ర్ పాత్ర‌ల విష‌యంలో తొంద‌ర‌ ప‌డ‌ని కీర్తి సురేష్ ఇప్పుడు ఆ త‌ర‌హా పాత్రల‌కు రెడీగానే ఉంద‌ని 'స‌ర్కారు వారి పాట‌'తో ప్రూవ్ చేసింది. సినిమాలో అమ్మ‌డు గ్లామ‌ర్ పాత్ర‌తో యువ‌త‌ని ఆక‌ట్టుకుంది. కాలంతో పాటు త‌న‌లో సైతం వ‌చ్చిన మార్పు ఇద‌ని చెప్ప‌క‌నే చెప్పింది.

అయితే హీరోయిన్ గా మాత్రం అమ్మ‌డు ఇప్ప‌టికీ బిజీగా లేద‌నే చెప్పాలి. 'స‌ర్కారు వారి పాట'  లాంటి క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ ప‌డినా నాయికా ప్రాదాన్యం ఉన్న పాత్ర‌లు పుంజుకోలేదు. ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న 'ద‌స‌రా'లో న‌టిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 'భోళా శంక‌ర్' సిస్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ రెండు మిన‌హా కొత్త ప్రాజెక్ట్ లు ఏవి చేతిలో లేవు. స‌క్సెస్ ప‌రంగానూ రేసులో వెనుక‌బాటు త‌నం క‌నిపిస్తుంది.

ఇక సొట్ట‌బుగ్గ‌ల తాప్సీ టాలీవుడ్ ని వ‌దిలి బాలీవుడ్ కి వెళ్లి అన్నిజొన‌ర్ల‌లో ఎడెపెడా సినిమాలు చేస్తుంది. బ‌యోపిక్  లు సైతం విడిచి పెట్ట‌డం లేదు. జోరుగా వాటిని  తెర‌పైకి తీసుకొచ్చి ఏ జాన‌ర్ అయిన త‌గ్గేదేలే! అంటూ దూసుకుపోతుంది. మ‌రి స‌క్సెస్ మాటేంటి? అంటే?  ఆ వేగం  ఇంత వ‌ర‌కూ ఏ సినిమా విష‌యంలోనూ క‌నిపించ‌లేదు.

సినిమాలైతే చేస్తుంది గానీ ..చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ ఒక్క‌టీ లేదు.  తాప్సీ మార్క్ ప‌డ్డ సినిమా ఏది లేదు. ఇదే ఏడాది ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  'లూప్ లా పేట్'..'మిష‌న్ ఇంపాజ్ బుల్'..'శ‌భాష్ మిథు'..'దోబారా' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ  బాక్సాఫీస్ వ‌ద్ద మోత మోగించిన సినిమా ఒక‌టీ లేదు.

ప్ర‌స్తుతం కోలీవుడ్ లో 'జ‌న‌గ‌ణ‌మ‌న‌'..'ఏలియ‌న్' చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే హిందీలో 'బ్ల‌ర్'..'హూ ల‌డ్కీ హై కహాన్'..'డంకీ' చిత్రాల్లో న‌టిస్తోంది.  ప్ర‌స్తుతం అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ ఈ సినిమాల‌పైనే ఉన్నాయి. క‌మ‌ర్శియ‌ల్ హిట్ అందుకుని  బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాల‌ని ఆశ‌ప‌డుతుంది.  మరి తాప్సీ క‌ల ఈ సినిమాలతోనైనా నెర‌వేరుతుందో ?  లేదో? చూడాలి.
Tags:    

Similar News