ఆర్జీవీ.. రాంగోపాల్ వర్మ.. ఈ పేరు చెబితేనే వివాదాలు.. గొడవలు.. రచ్చ రచ్చలు.. అలాంటి వివాదాస్పద డైరెక్టర్ కే షాక్ ఇచ్చేలా ఓ సినీ గేయ రచయితే సంధించిన అస్త్రమే.. ‘ఆర్జీవీ’. అందరినీ కెలికే రాంగోపాల్ వర్మనే కెలకడానికి రెడీ అయ్యాడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.
ఓ వివాదంలో రాంగోపాల్ వర్మకు, జొన్నవిత్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. అందరిపై సినిమాలు తీసి వారి పరువును బజారున పడేసే వర్మకు జలక్ ఇస్తానని అనాడే జొన్నవిత్తుల సవాల్ చేశారు. అన్నట్టే వర్మ మీద సినిమాను పట్టాలెక్కించాడు. తాజాగా జొన్నవిత్తుల ‘ఆర్జీవీ’ లోగోను విడుదల చేశాడు. కింద ట్యాగ్ లైన్ గా ‘రోజూ గిల్లే వాడు’ అంటూ జత చేశాడు. దీంతో ఈ పిక్ వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన ఈ రామబాణమే ఈ సినిమా అని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేశానన్నారు.
ఇక ఈ సినిమాలో సురేష్ - శ్రద్ధాదాస్ - అమిత్ - పునర్నవి భూపాలం - తేజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాల కుటుంబరావు నిర్మిస్తున్నారు.