సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ఆక్టివ్ గా ఉండరనే ప్రచారం ఉంది. అప్పుడప్పుడు మాత్రమే నెట్టింట్లో దర్శనం ఇస్తారు. అయితే తాజాగా జరిగిన సంఘటన ద్వారా ఆయన ఎప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతారనే అనే విషయం పక్కాగా అర్థమవుతోంది.
ఎలా అంటే...? 'ఆర్ఆర్ఆర్' విడుదలై ఏడాది కావొస్తున్నా ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. కానీ ఆర్ఆర్ఆర్ లో నటించిన రాంచరణ్ మాత్రం 'ఆచార్య'తో పలకరించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. షూటింగ్ చాలా వరకు కంప్లీట్ కూడా అయింది. మిగతా సినిమాలను లైనులో పెడుతున్నారు. కానీ NTR మాత్రం 'ఆర్ఆర్ఆర్' దగ్గరే ఆగిపోయారు. ఏడాదిన్నర క్రితం 'ఆర్ఆర్ఆర్' లాస్ట్ షెడ్యూల్ అప్‌డేట్ తర్వాత ఆయన నుంచి మరో షూటింగ్ అప్‌డేట్ లేదు. దింతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ప్లానింగ్ సరిగా లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. ఇక అక్కడ కూడా ఫ్యాన్స్ అప్‌డేట్స్ ఇవ్వాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో విసుగు చెందిన ఎన్టీఆర్ స్పీచ్ చివర్లో అభిమానులకు క్లాస్ పీకారు. అలాగే యాంకర్ సుమపై సీరియస్ అయ్యారు. అప్డేట్స్ అంటూ పదే పదే అంటూ దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకు రావద్దని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా కొత్త కబురు ఉంటే నా భార్య కంటే ముందు మీకే ముందు చెబుతానన్నారు. నిజం చెప్పాలంటే ఆయన మాటల్లో బాగా కోపం కనిపించింది. అయితే ఈ కోపానికి మరో కారణం కూడా ఉంది.
అదేంటంటే.. ఒక్కసారి సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనే విషయానికి వెళితే... రీసెంట్ ట్విట్టర్ ట్రెండ్స్ లో దళపతి విజయ్ కొత్త సినిమా 'లియో' కనిపించింది. సంక్రాంతికి వారసుడుతో పలకరించిన ఆయన.. గ్యాప్ లేకుండా మూవీ అప్‌డేట్స్ ఇచ్చారు. సంజయ్ దత్ నుంచి మొదలు.. త్రిష ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, ఇంకా ఇతర ఆర్టిస్టుల వివరాలు వెల్లడించారు. పూజా కార్యక్రమాలు చేసి వీడియో విడుదల చేశారు. ఆ వెంటనే కశ్మీర్ షెడ్యూల్ మొదలుపెట్టి ఎయిర్ పోర్టులో వీడియోలు విడుదల చేశారు. ఒకదాని వెంట మరొకటి... 'లియో' అప్డేట్స్ వచ్చాయి.
మరో తమిళ హీరో అజిత్ కూడా సంక్రాంతికి 'తెగింపు' వచ్చారు. ఆ తర్వాత వెంటనే మరో సినిమాను కూడా ప్రకటించి ఆ పనుల్లో బిజీ అయ్యారు. అలా ఈ ఇద్దరి కొత్త సినిమా గురించి కబుర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు మీమ్ పేజీల్లో టాలీవుడ్ స్టార్స్ పై సెటైర్లు పడ్డాయి. తమిళ హీరోలను చూసి నేర్చుకోమంటూ సూటిగా కామెంట్స్ చేశారు. మరోవైపు అప్‌డేట్స్ అంటూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మీద, దర్శకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఏదైనా అనౌన్స్ చేయడం ఆలస్యం... ఎన్టీఆర్ 30 సంగతి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. అలా అభిమానులతో పాటు మీమర్స్ చేస్తున్న హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది.
ఇదంతా ఎన్టీఆర్ రెగ్యులర్ గా సోషల్ మీడియా ఫాలో అవుతూ గమనించి ఉండవచ్చు. ఫ్యాన్స్ పెట్టే కామెంట్లు పై కూడా ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఎన్టీఆర్ ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చని అర్థమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.