రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రముఖ చానెల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురైంది. సోషల్ నెట్ వర్క్ లో సదరు ఛానెల్ పై ఎన్టీఆర్ అభిమానులు ఒక రేంజ్ లో దుమ్మెత్తి పోస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. దీపావళి రోజున ఆ చానల్ "జనతా గ్యారేజ్" సినిమాను టీవీలో ప్రసారం చేయనుండటమేనట. అదేంటి తమ అభిమాన హీరో సినిమాను పండుగ రోజున టెలీకాస్ట్ చేస్తే సంతోషించాలి కానీ ఇలా ఆగ్రహించడం - సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం ఏమిటి అంటారా? అక్కడే ఉంది అసలు మెలిక మరి!!
గత నెలలో ఎన్టీఆర్ - మోహన్ లాల్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోని కలెక్షన్లతో భాక్సాఫీస్ ని దున్నేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అభిమానులకు జనతా గ్యారేజ్ విషయంలో ఎదురైన సమస్య ఏమిటీ అంటే... ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోగానే, అలా మాటీవిలో రాబోతోంది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5:30 గంటలకి టెలికాస్ట్ చేయనుంది మాటీవి. ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకి ఏమాత్రం నచ్చట్లేదు సరికదా ఈ విషయంలో కావాలనే ఎవరో ఎన్టీఆర్ కు అన్యాయం చేస్తున్నారనేది వారి ఆరోపణ. ఈ మేరకు సదరు టీవీ చానల్ ని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో తిడుతున్నారు.
అయితే ఇప్పటికే రూ. 100కోట్ల క్లబ్ లో చేరిన సినిమాను ఎలాగైనా కొన్ని థియేటర్లలో అయినా వందరోజులు ఆడించాలనేది అభిమానుల ప్లాన్! అయితే, ఈ ఆశలపై నీళ్లు చల్లుతూ దీపావళి సందర్భంగా ఆ చానెల్ "జనతా గ్యారెజ్"ను టెలీకాస్ట్ చేస్తుండడంతో ఇక థియేటర్ కు వచ్చి తమ హీరో సినిమాను ఎవరు చూస్తారు అని అభిమానులు ఆందోళన చెందుతున్నారట. దీంతో ఆ ఛానెల్‌కు వ్యతిరేకంగా సోషల్ నెట్ వర్క్ లో తమ దాడిని మొదలు పెట్టారట.
అయితే జూనియర్ అభిమానుల బాధలో న్యాయమున్నప్పటికీ ఇక్కడ ఎవరూ మాటీవీని తప్పు పట్టాల్సిన పని లేదనే చెప్పాలి. ఎందుకంటే శాటిలైట్స్ హక్కులను అమ్మేటప్పుడు నిర్మాతకు ఛానల్ కు మధ్య పక్కా అగ్రిమెంట్ ఉంటుంది. ఎన్ని రోజుల తర్వాత సినిమాను టీవీలో టెలికాస్ట్ చేయవచ్చన్నది కూడా ఆ అగ్రిమెంట్ లో స్పష్టంగా రాసుకుంటారు. కాబట్టి జనతా గ్యారేజ్ వంద రోజులు పూర్తి కాకుండానే మాటీవీ ప్రసారం చేస్తే, అది నిర్మాతకు సంబందించిన విషయం అవుతుంది కానీ మాటీవీని తప్పుపట్టడం దేనికి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతునాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/