నందమూరి అభిమానులు మరో అరుదైన రికార్డును కొట్టేశారు. ఎన్టీఆర్ 'ఆర్ఆర్‌ఆర్' వీడియో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 మిలియన్ ల వ్యూస్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది. రామరాజు ఫర్ భీమ్ వీడియోలో ఎన్టీఆర్ లుక్ మరియు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో భీమ్ ఇంట్రో వీడియో అదిరి పోయేలా వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఈ వీడియోపై ప్రశంసలు కురిపించేలా ఉంది. విడుదల అయిన ఇన్నాళ్ల తర్వాత కూడా భారీగానే వ్యూస్ వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా అభిమానులు పట్టుదల అంటూ టాక్ వినిపిస్తుంది. తమ హీరో వీడియోకు అరుదైన రికార్డును అందించాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటూ భీమ్ ఇంట్రో వీడియోకు 50 మిలియన్ ల వ్యూస్ ను కట్టబెట్టారు.
భీమ్ ఇంట్రో వీడియో విడుదల అయ్యి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు కూడా వీడియోకు ప్రతి రోజు భారీగా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. 50 మిలియన్ ల వ్యూస్ తో పాటు 1.3 మిలియన్ ల లైక్స్ ఈ వీడియోకు వచ్చాయి. అయితే ఈ వీడియోను 53 వేల మంది డిస్ లైక్ కూడా చేయడం జరిగింది. ఎన్టీఆర్ లుక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇలా అన్ని కలిసి వీడియోపై జనాల్లో ఆసక్తి పెంచాయి. భీమ్ వీడియోకు ముందు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామరాజు వీడియో వచ్చింది. అది వచ్చి ఏడాది దాటి పోయింది. ఆ వీడియోకు యూట్యూబ్ లో 43 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా పై అంచనాలను పీక్స్ కు తీసుకు వెళ్లిన ఈ రెండు వీడియోలు సినిమా స్థాయిని మరింతగా పెంచాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సినిమాల్లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పాత్రలపై పూర్తి స్పష్టత ఇవ్వకుండా సినిమాపై అంచనాలు పెంచే విధంగా రామ రాజు ఫర్ భీమ్.. మరియు భీమ్ ఫర్ రామరాజు వీడియోలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా కారణంగా కాస్త నెమ్మదిగా సాగుతున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. కాని షూటింగ్ సక్రమంగా సాగక పోవడం వల్ల సినిమాను వాయిదా వేసే అవకాశాలున్నాయంటున్నారు.