రాత్రిళ్ళు చెమట చిందిస్తున్న తారక్

Update: 2019-06-05 05:02 GMT
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మళ్ళి స్వింగ్ లోకి వచ్చేసింది. రామ్ చరణ్ గాయంతో మొదలైన గ్యాప్ తారక్ కు తగిలిన దెబ్బతో ఏకంగా నెలన్నర బ్రేక్ ఇచ్చేసింది. ఇప్పుడు రాజమౌళి ట్రాక్ లోకి వచ్చేశాడు. ఇద్దరు హీరోలు పూర్తిగా కోలుకోవడంతో త్వరితగతిన హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసి అహ్మదాబాద్ వెళ్లేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగా భాగ్యనగరంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడితోనే షూట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

చరణ్ ఆఫ్రికా ట్రిప్ ని పూర్తి చేసుకుని వచ్చాక యూనిట్ తో జాయిన్ అవుతాడు. ఇదిలా ఉండగా తారక్ మీద ఏం తీస్తున్నాడు అనే దాని గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కేవలం రాత్రివేళలలో మాత్రమే జక్కన్న సన్నవేశాలను తెరకెక్కిస్తున్నాడట. కొమరం భీమ్ ఛాయల్లో చేస్తున్న యంగ్ టైగర్ పాత్ర బ్రిటిషర్లతో వీరోచితంగా పోరాడి దుర్మార్గాలకు పాల్పడిన అధికారులను అంతమొందించే ఎపిసోడ్స్ ఇప్పుడు తీస్తున్నారని తెలిసింది.

అందుకే పగలంతా రెస్ట్ తీసుకుని తారక్ రాత్రి పూట భీమ్ పాత్రలో చెమటలు చిందిస్తున్నాడు. ఇది చాలా కీలకమైన భాగమని అందుకే ఏకంగా 130 అడుగుల ఎత్తులో కెమెరాలు పెట్టి మరీ చిత్రీకరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కాని తారక్ పక్కన జోడిని మాత్రం ఇప్పటిదాకా ప్రకటించలేదు. ముందుఅనుకున్న కథ ప్రకారం విదేశీ వనిత ఉంటుందా లేక స్టొరీ మార్చి ఇండియన్ బ్యూటీతో రీ ప్లేస్ చేశారా అనే దాని గురించి మాత్రం క్లారిటీ లేదు

   

Tags:    

Similar News