ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరికొన్ని వారాల్లోనే ఈ టూర్ ముగియనుండగా.. అక్కడి నుంచి త్రివిక్రమ్ తెరకెక్కించే మూవీకి సిద్ధమవుతాడు జూనియర్. దాదాపు రెండు నెలలు గ్యాప్ ఉండడంతో.. తన ఫిజిక్ ను కూడా కొంతమేర ఛేంజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయట.
అయితే.. ఈ గ్యాప్ ను తన మరుసటి ప్రాజెక్టును ఫైనల్ చేసుకునేందుకు ఉపయోగించాలని భావిస్తున్నాడట జూనియర్. ఇప్పటికే త్రివిక్రమ్ తర్వాత సినిమా విషయంలో కూడా ఓ తుది నిర్ణయానికి వచ్చేశాడని తెలుస్తోంది. శతమానం భవతి చిత్రంతో ఈ ఏడాది ప్రారంభంలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సతీష్ వేగేశ్న. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో తన పట్టు ఎలాంటిదో చూపించాడు కూడా. ఈ డైరెక్టర్ తోనే ప్రొసీడ్ అవ్వాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్.
త్రివిక్రమ్ తో కూడా ఫ్యామిలీ మూవీనే చేయనున్న జూనియర్.. ఆ తర్వాత కూడా ఇదే జోనర్ లో సినిమా చేసి.. ఈ జోనర్ లో తన పట్టు పెంచుకోవాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ పై స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు సతీష్ వేగేశ్న. ఈ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టుపై అందరూ ఓకే చెప్పేసుకుని ఎన్టీఆర్ తగినట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు ప్రారంభించే ఛాన్సులు ఉన్నాయి.