టాలీవుడ్ లోనే కాదు.. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ విషయంలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా నైన్ టోటల్ కోసం, నైన్ నెంబర్ కోసం వెంపర్లాడేవాళ్లు చాలామందే ఉంటారు. ఇక 9999 నెంబర్ కి ఉండే డిమాండ్.. వేరే ఏ నెంబర్ కి ఉండదని చెప్పచ్చు. ఈ ఫ్యాన్సీ నెంబర్ ని ఇప్పుడు ఎన్టీఆర్ 11 లక్షల రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నాడు.
రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఓ బీఎండబ్ల్యూ 7సిరీస్ కార్ కొన్నాడు. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ 09 ఎక్స్ ఎక్స్ 9999(ఎక్స్ ఎక్స్ రిఫరెన్స్ మాత్రమే). ఈ కారుకు ఎట్టి పరిస్థితుల్లోనూ 9999 నెంబర్ మాత్రమే ఉండాలని పట్టుబట్టాడు యంగ్ టైగర్. చివరకు తను అనుకున్నది సాధించడానికి 11 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. నెంబర్ కోసం 11 లక్షలు అవసరమా అనిపించచ్చు కానీ.. సెంటిమెంట్ ముందు ఎన్ని లక్షలైనా ఒకటే కదా. ఇక ఇప్పటివరకూ తన మామగారైన నార్నే శ్రీనివాసరావు ఇచ్చిన రేంజ్ రోవర్ లో తిరిగే ఎన్టీఆర్.. ఇప్పుడు ఓ బీఎండబ్ల్యూను సొంతం చేసుకున్నాడు.
రీసెంట్ గా మామగారిచ్చిన కారుకు పోలీసులు 700 ఫైన్ వేసిన విషయం తెలిసిందే. అందుకే ఆ కార్ ని పక్కన పెట్టేసి ఈ కొత్త కార్ ని తీసుకున్నాడనే ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న జనతా గ్యారేజ్.. శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతోంది.