రాత్రి 10కి రమ్మంటే అర్థరాత్రి 2.30 కి వచ్చాడట

Update: 2021-09-25 13:30 GMT
బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ కు ఉన్న పెద్ద బ్యాడ్‌ హ్యాబిట్‌ గురించి జూహ్లీ చావ్లా చెప్పుకొచ్చింది. ఆయన బ్యాడ్‌ హ్యాబిట్ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డ సందర్బాలు చాలా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఇటీవల ఒక చిట్ చాట్ లో షారుఖ్ గురించి... అతడితో తన స్నేహం గురించి మాట్లాడింది. ఆ సమయంలోనే షారుఖ్‌ కొన్ని విషయాల్లో బ్యాడ్ హ్యాబిట్ ను కలిగి ఉన్నాడని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పార్టీకి హాజరు అవ్వమని ఎవరైనా ఆహ్వానిస్తే ఆయన హాజరు అయ్యే టైమ్ అందరికి షాక్‌ గా ఉంటుంది. తాను ఒక సారి షారుఖ్‌ ను ఒక ప్రైవేట్‌ పార్టీకి పిలిస్తే ఆయన వచ్చిన టైమ్‌ కు నేను షాక్ అయ్యాను. రాత్రి పది గంటల సమయంలో పార్టీ ప్రారంభం అవుతుంది. ఆ సమయంకు రావాలంటూ నేను పిలిచే సమయంలోనే చెప్పాను. ఆయన మాత్రం పది కాకుండా ఏకంగా అర్థరాత్రి 2.30 కి వచ్చాడు.

అర్థరాత్రి సమయంలో వచ్చి తలుపు కొట్టాడు. ఆ సమయంలో పార్టీ పూర్తి అయ్యి గెస్ట్‌ లు అంతా వెళ్లి పోయారు. పని వాళ్లు కూడా అంతా పడుకున్నారు. ఒక్కరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారు పడుకునే ఉన్నారు. ఆ సమయంలో ఆయన రావడం ఆశ్చర్యం అనిపించింది. షారుఖ్ ఖాన్‌ ఎప్పుడు కూడా లేట్ గానే వస్తూ ఉంటాడు. ఆయన ఈ పార్టీ అనే కాకుండా ఏ పార్టీ అయినా లేట్ అవుతూనే ఉంటాడు. చాలా అరుదుగా మాత్రం పార్టీ టైమ్‌ కంటే ముందు వచ్చి ఆశ్చర్యపర్చుతాడు అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి షారుఖ్ తో పార్టీ ప్లాన్‌ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అతడు షాక్ ఇస్తాడని బాలీవుడ్ లో చాలా మందికి తెలుసని చెప్పుకొచ్చింది.

ఇక షారుఖ్‌ ఖాన్‌ జీరో సినిమా ప్లాప్‌ అవ్వడంతో దాదాపు మూడు ఏళ్లుగా తన తదుపరి సినిమాను విడుదల చేయలేదు. ఇటీవలే రెండు మూడు సినిమాలను మొదలు పెట్టాడు. వచ్చే ఏడాదిలో షారుఖ్‌ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ లను ఎన్నో దక్కించుకున్న షారుఖ్ ఖాన్‌ గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం నిరాశ పర్చుతూనే ఉన్నాడు. దాదాపుగా దశాబ్ద కాలంగా షారుఖ్ నుండి భారీ విజయం కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. పార్టీలకు ఎలా అయితే లేట్ గా వెళ్తాడో అలాగే సినిమాలను కూడా లేట్‌ గా చేస్తూ సక్సెస్ ను కూడా లేట్‌ గా ఇస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్‌ మళ్లీ తన పూర్వ వైభవంను సంతరించుకుంటాడా అనేది చూడాలి.
Tags:    

Similar News