వైరల్: యువనటి అశ్లీల ఫొటోలు - వీడియోలు లీక్

Update: 2020-04-10 12:33 GMT
మలయాళ యువ నటి జుహి రస్తోగికి చేదు అనుభవం ఎదురైంది. తనకు తెలియకుండానే ఆమె అశ్లీల ఫొటోలు - వీడియోలను కొందరు మార్ఫింగ్ చేసి ఆన్ లైన్ లో లీక్ చేశారు. ఇవి చూసిన యువ నటి జుహి రస్తోగి షాక్ తింది.

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు - వీడియోలు అసభ్యంగా అశ్లీలంగా కొందరు మార్ఫింగ్ చేసి వదలడంపై నటి జుహీ సీరియస్ అయ్యింది. కేరళ డీజీపీని - ఎర్నాకులం సీటీ పోలీసులను కలిసి వాటిని తొలగించి పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

తన పరువు తీసేలా.. ప్రతిష్టకు భంగం కలిగేలా చేసిన ఈ పోస్టును అభిమానుల సహాయంతో గుర్తించి అకౌంట్ల వివరాలను పోలీసులకు సమర్పించింది. అవి నా అకౌంట్లు కాదని.. నా పేరుతో నడిచే ఫేక్ అకౌంట్లని.. అందులోని తన అశ్లీల వీడియోలను తొలగించి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

జుహీ ఫిర్యాదుపై కేరళ పోలీసులు తక్షణమే స్పందించారు. దర్యాప్తు జరుపుతున్నామని.. సైబర్ చట్టాల ప్రకారం వారిని వెంటనే శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News