మెగా జులై కలిసి వస్తుందా

Update: 2018-06-26 14:30 GMT
టాలీవుడ్ లో కొన్ని  సెంటిమెంట్స్ విచిత్రంగా ఉంటాయి. సినిమా ఫలితం అనేది కంటెంట్ మీద ఆధాపడటం నిజమే అయినప్పటికీ వీటిని నమ్మేవాళ్ళు మాత్రం ఉంటూనే ఉంటారు. అందులోనూ అభిమానులు వీటిని సీరియస్ గా తీసుకుంటారు. ఈ సంవత్సరం మెగా ఫామిలీకి బోణీ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రూపంలో డిజాస్టర్ తో మొదలైనా వరుణ్ తేజ్ తొలిప్రేమ రామ్ చరణ్ రంగస్థలం ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచి మెగా ఫాన్స్ లో జోష్ ని నింపాయి. అఫ్ కోర్స్ వీటికి ముందు ఇంటెలిజెంట్ ఉంది లెండి.

ఇక ఇప్పుడు జులైలో మరో రెండు మెగా సినిమాలు రాబోతున్నాయి. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం సాఫ్ట్ లవర్ బాయ్ గా చేసిన తేజ్ ఐ లవ్ యు జులై 6 విడుదల కానుండగా  ఒక్క వారం ఆలస్యంగా చిరు చిన్నల్లుడు  కళ్యాణ్ దేవ్ విజేత వచ్చేస్తుంది. రెండింటి మీద భారీ అంచనాలు లేవు కానీ టాక్ బాగుండి  సినిమా గురించి పాజిటివ్ గా స్ప్రెడ్ అయితే ఆటోమేటిక్ గా హిట్ క్యాటగిరీలో పడిపోతాయి.

ఇక మెగాభిమానులు మాత్రం జులై సెంటిమెంట్ ను బాగా హై లైట్ చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జులైలోనే రాగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మిగిలిపోయిన తొలిప్రేమ వచ్చింది కూడా ఈ నెలలోనే. ఇక ఇండస్ట్రీ రికార్డ్స్ తన పేరు మీద ఉండేలా చరిత్ర సృష్టించిన మెగాస్టార్ ఇంద్ర రిలీజ్ అయ్యింది కూడా జులైలోనే. ఇక రామ్ చరణ్ రేంజ్ ని అమాంతం ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన మగధీర కూడా జులై ఖాతాలోనే ఉంది. మరి ఇన్ని రకాలుగా మెగా హీరోల సినిమాలకు కలిసి వచ్చిన జులై నెల తేజ్ ఐ లవ్ యు-విజేతలకు ఎంత హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.

ఇక్కడ ఒకటి చిన్న ట్విస్ట్ ఉంది. పైన చెప్పిన బ్లాక్ బస్టర్స్ అన్ని జులై చివరి వారం లేదా అంతకు ముందు వారం వచ్చినవి. కానీ తేజ్ ఐ లవ్ యు ప్లస్ విజేత మొదటి రెండు వారాల్లో వస్తున్నాయి. సో ఇక్కడ నెల సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేక వారం  కూడా పని  చేసిందా అని తెలియాలంటే ఆ రెండు సినిమాల విడుదల దాకా ఆగాలి .
Tags:    

Similar News