డ్రగ్స్ ఊబిలో పాప్ స్టార్ .. రాత్రులు ఉన్నానో పోయానో చెక్ చేస్తున్నారు!!
మాదకద్రవ్యాల అలవాటు ఎంత పెద్ద సెలబ్రిటీని అయినా చివరకు ధైన్యమైన స్థితిలోకి తీసుకెళ్లిపోవడం ఖాయం. ఇప్పుడు అలాంటి ధైన్యమైన స్థితిలోకి జారుకున్నానని తాను బతికి ఉన్నానో లేదో పల్స్ చెక్ చేసేందుకు తన బాడీ గార్డులు రాత్రి వేళలు తన రూమ్ లోకి ప్రవేశిస్తారని చెబుతున్నారు సదరు పాప్ స్టార్. ఇంతకీ ఎవరాయన? అంటే ది గ్రేట్ పాప్ స్టార్ కం మోడల్ జస్టిన్ బీబర్.
పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తననదైన అద్భుత గానంతో పవర్ ప్యాక్డ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ తో ప్రపంచంలోనే అతిపెద్ద పాప్ ఐకాన్లలో ఒకరిగా నిలిచారు. యంగ్ స్టార్ చాలా చిన్న వయస్సులోనే పాప్ స్టార్ కావడానికి చేసిన పోరాటాలపైనా అలాగే డ్రగ్స్ తీసుకోవటానికి ఎలా బానిసయ్యాడో బహిరంగంగా వెల్లడించారు.
తన మాదకద్రవ్యాల వాడకం చాలా తీవ్రంగా మారిందని తరచూ అతని బాడీగార్డులు రాత్రి తన గదిలోకి చొరబడాల్సి వస్తోందని .. ఇంకా బతికే ఉన్నానా లేదా నిర్ధారించుకోవడానికి పల్స్ తనిఖీ చేయాల్సి వస్తోందని బీబర్ చెప్పాడు. నేను విచారంగా ఉన్నాను. ఇంకా బాధలో ఉన్నాను. నాకు పరిష్కరించని సమస్యలు ఉన్నాయి. అన్ని విజయాలు ప్రతిదీ మంచిగా చేస్తాయని నేను అనుకున్నాను. అందువల్ల నాకు మందులు కేవలం తిమ్మిరి బిల్లలు మాత్రమే అని జస్టిన్ అన్నారు. భద్రతాభావంతో ఉండే శత్రువుల్ని చూస్తే తాను దూకుడుగా మారతానని కూడా జస్టిన్ అన్నారు. కోపంగా ఉన్నా కలలతో ఉంటానని అన్నారు.
నాకు మోనో.. లైమ్ అనే వ్యాధులు ఉన్నాయి. కానీ నేను చాలా భావోద్వేగ పూరితంగా మారాను అని అన్నారు. 2018 లో అమెరికన్ మోడల్ మీడియా పర్సనాలిటీ హేలీ బాల్డ్విన్ ను జస్టిన్ బీబర్ వివాహం చేసుకున్నారు. పాప్ ప్రపంచంలో ఎదురే లేని చక్రవర్తిగా ఏలుతున్నా డ్రగ్స్ వల్ల నేటి ధీన స్థితి అతడిని అన్నివిధాలా దిగజారుస్తోందని అభిమానులు ఆవేన చెందుతున్నారు.