నేను అంత ఈజీగా పడే టైప్ కాదు

Update: 2016-11-24 09:30 GMT
గుత్తా జ్వాల పరిచయం అక్కర్లేని ప్లేయర్. పేరుకు తగ్గట్టే ఫైర్ బ్రాండ్. చెప్పదల్చుకున్న విషయాన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడేసి వివాదాల్ని ఎలా క్రియేట్ చేయొచ్చో జ్వాలని చూసి నేర్చుకోవచ్చు. జ్వాలకి వివాదాలు సృష్టించే ఉద్ధేశ్యాలు లేకపోయినా ఆటోమోటిగ్గా నిప్పు అలా రాజుకుంటుందంతే. అందుకే జ్వాల ఏం మాట్లాడినా కొత్త అర్థాలు వినిపిస్తుంటాయ్.

రీసెంట్ గా ప్రింట్ మీడియాకి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇంటర్వ్యూలో తన కెరీర్ దగ్గర్నుంచి లేడీ అథ్లెట్స్ ని టార్గెట్ చేయడం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. వల్గర్ కామెంట్స్ ఇలా అన్నింటి గురించి మాట్లాడింది. స్పోర్ట్స్ ఉమెన్ అంతా పొట్టి బట్టలు వేసుకోవడం కామన్ అని.. కానీ మ్యాచ్ లు ఆడే సందర్భంగా తీసే ఫోటోలు షేర్ చేసుకోని పర్సనాల్టీస్ మీద.. కొలతల మీద కామెంట్ చేస్తూ పోస్ట్స్ షేర్ చేస్తుంటారని ఇది ఎంత వరకు కరెక్ట్ అంటోంది.

ఏదైనా ఫోటో షేర్ చేస్తే పిచ్చి కామెంట్స్ చేసే వాళ్లని.. మొదట్లో బాధ పడ్డా.. ఇప్పుడు అస్సలు పట్టించుకోవట్లేదని.. అలాగే వచ్చి సెల్ఫీ అని దిగితే ఇది వరకు ఫోజులిచ్చే దాన్నన్ని కానీ ఆ ఫోటోస్ పట్టుకోని వెటకారాలు చేస్తున్నారని అర్థమయ్యాక సెల్ఫీలతో ఎంటర్ టైన్ చేయడం మానేశానని.. మెంటల్లీ తాను స్ట్రాంగ్ అని.. నన్ను.. నా డ్రెస్ లు.. బాడీ లాంగ్వేజ్ చూసి ఏదో నాలుగు మాటలు అనేసి బాధపడేలా చేద్దామంటే అస్సలు కుదరదని.. తాను అంత ఈజీగా మాటలకి బెదిరే రకం కాదని చెప్పుకొచ్చింది. గట్టిగా మాట్లాడితే ఫెమినిస్ట్ అని ముద్ర వేస్తారు కానీ జ్వాల చెప్పింది కూడా  కరెక్టే కదా. కాస్త ఆలోచించండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News