ప్రభాస్ అంటే లవ్ ఎందుకో గుత్తా చెప్పింది!

Update: 2016-11-19 04:27 GMT
గుత్తా జ్వాల అన్న వెంటనే ఆమె ఆట.. ఆమె వెంట నడిచి వచ్చే వివాదాలు ఒకదాని వెంట మరొకటిగా గుర్తుకు వస్తాయి. తనను తాను ఫ్రూవ్ చేసుకోవటానికి ఆమె ఎంతగానో కష్టపడిందన్నది ఆమెకు సంబంధించిన పాజిటివ్ కామెంట్ అయితే.. ఆమె ఇగోయిస్టిక్.. ఎవరికి లేనన్ని గొడవలు ఆమె చుట్టూనే ఎందుకు ఉంటాయి? అన్నది నెగిటివ్ కామెంట్. మిగిలిన మాటలు ఎలా ఉన్నా.. గుత్తా జ్వాల గురించి ఒక మీడియా ప్రతినిధిగా చెప్పాలంటే.. ఆమె చాలా సోషల్ గా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు ఫ్రాంక్ గా మాట్లాడతారు. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అన్న విషయాన్ని పక్కన పెట్టి.. తనకు అనిపించింది అనిపించినట్లు చెప్పేసే ధైర్యం ఆమె సొంతం అని చెప్పక తప్పదు.

ఇలా ఓపెన్ గా ఉండటం నచ్చకపోవటం వల్ల కాబోలు.. చాలామంది ఆమెను.. ఆమె ఆవేశాన్ని అర్థం చేసుకునే కన్నా అపార్థం చేసుకునే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా ఆమె ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఓపెన్ ఇంటర్వ్యూ ఇచ్చేశారు. ఇక్కడ ఓపెన్ అన్న మాట ఎందుకంటే.. విషయం ఏదైనా కావొచ్చు.. సూటిగా.. సుత్తి లేకుండా ఫటా.. ఫటా తేల్చేసినట్లుగా మాట్లాడేశారు. ఆట గురించి కావొచ్చు.. ఆటగాళ్లకు ఉండే అవకాశాలు.. ఎంత మేర ప్రోత్సహిస్తున్నారు? తనపై వచ్చిన వివాదాలు.. గోపీ చంద్ తో తనకున్న తగవు లాంటి విషయాల్నిచెప్పేశారు.

వీటితో పాటు.. వ్యక్తిగత విషయాల గురించి చెప్పేశారు. బ్రేకప్ అయిన తన పెళ్లి గురించి చెప్పటమేకాదు.. మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు ఆ.. చేసుకుంటాను అనిచెప్పటమే కాదు.. ఎలాంటి అబ్బాయి తనకు కావాలో కూడా స్పష్టంగా చెప్పేశారు. ఇవే కాదు.. తాను ఎవరిని అభిమానించేది.. లవ్ చేసేదీ చెప్పేసిన ఆమె మాటల్లో ప్రభాస్ మాటలకు సంబంధించి అందరి దృష్టి పడేలా మాట్లాడటం కనిపిస్తుంది.

ఆమె పెళ్లి.. ప్రభాస్ .. నితిన్.. నానిల గురించి ఆమెచెప్పిన మాటల్ని యథాతధంగా చూస్తే..

= పెళ్లి నాటికి నేను అంత పాపులర్.. ఫేమస్ కాదు. పెళ్లి ద్వారా చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో మా అమ్మానాన్నలను చూసీ చాలా అర్థం చేసుకున్నారు. పెళ్లి అనేది భార్యభర్తల ఇద్దరిలో ఎవరికీ పరిమితిలా ఉండకూడదు.  భర్తకు చేదోడుగా భార్య.. భార్యకు చేయూతగా భర్త ఉండాలి. మా ఇద్దరి విషయంలో అలా జరగలేదు. వీటితో పాటు ఇంకేవో కొన్నివిషయాలు. వీటన్నితో ఆ రిలేషన్ కంటిన్యూ చేయలేననిపించింది. విడిపోయాం. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచన లేకుండా లేకపోలేదు. కాకుంటే కొంచెం భయం. ఎవరినీ నమ్మలేను. మనుషులను అంచనా వేయటంలో చాలా పూర్. నా అనుభవాల వల్ల అంత త్వరగా కమిట్ కాలేను. బట్.. యెస్. పెళ్లి చేసుకునే ఆలోచన అయితే ఉంది కానీ నాకు కావాల్సిన మనిషి ఇంకా దొరకలేదు. కాకుంటే ఎత్తుగా ఉండాలి (నవ్వుతూ)

= సినిమాల్లో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాను. నితిన్ నాకు చాలా మంచి ఫ్రెండ్. మాకు ఒకకామన్ గ్రూప్ ఉంది. ఓసారి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే.. జ్వాలా..నా మూవీలో యాక్ట్ చేస్తావా? అని అడిగాడు. నేను అంతే క్యాజువల్ గా ఆ.. చేస్తాను అని చెప్పా. తర్వాత ఆ విషయమే మర్చిపోయా. మూడు నెలల తర్వాత.. జ్వాలా సాంగ్ రెఢీ అని వచ్చాడు. షాక్ తిన్నా. ఆ సమయంలో ఎక్కువగా ఆడటం లేదు. అందుకే చేశారు. సినిమాల్లో చేయలేను కానీ.. ఛాట్ షో చేయటం.. వాటికి హోస్ట్ చేయటం అయితే ఓకే. యూత్ కి ‘‘టు డీల్ విత్ ట్రూత్’’ పైన టీచ్ చేయటం ఇష్టం.

= తెలుగు.. హిందీ.. ఇంగ్లిష్ అన్నీ సినిమాలు చూడటం ఇష్టం. చీరలంటేచాలా ఇష్టం. సంప్రదాయ.. ప్రాశ్చత్య వస్తాలు రెండింటిని బాగా ఇష్టపడతా. తెలుగు హీరోల్లో ఐ లవ్ ప్రభాస్. నానీ అంటే కూడా ఇష్టమే. హి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. ఒకట్రెండుసార్లు ప్రభాస్ ను కలిశా. అతను చాలా పొడవు. వీ డోన్ట్ హ్యావ్ టాల్ మెన్ కదా (నవ్వుతూ)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News