‘జనతా గ్యారేజ్’ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయిన తర్వాతి రోజే మరో ఆసక్తికర సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. నారా రోహిత్-నాగశౌర్య-రెజీనా ప్రధాన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్ రూపొందించిన ‘జ్యో అచ్యుతానంద’ సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రోజే ఈ మేరకు నిర్మాత సాయి కొర్రపాటి ప్రెస్ నోటీ ఇచ్చారు. ముందు రోజు విక్రమ్ సినిమా ‘ఇంకొక్కడు’ వస్తున్నా.. 9న సునీల్ మూవీ ‘ఈడు గోల్డ్ ఎహే’ కూడా విడుదలయ్యే అవకాశమున్నా.. ‘జ్యో అచ్యుతానంద’ను అదే రోజు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లా కనిపిస్తున్న ఈ సినిమా స్యూర్ షాట్ హిట్ అన్న ఫీలింగ్ కలిగిస్తోంది. అందుకే సాయి కొర్రపాటి కాన్ఫిడెంటుగా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు.
ఈ సందర్భంగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నారారోహిత్.. నాగశౌర్య.. రెజీనాల మధ్య జరిగే క్యూట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్. ట్రైలర్ చూసినవారు అచ్యుత్ గా నారా రోహిత్, ఆనంద్ గా నాగశౌర్యల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే సున్నితమైన కథాంశమిది. ఎమోషన్స్.. ఎంటర్‌టైన్మెంట్ కలగలిసి ఉంటుంది. అలాగే నా దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకు భిన్నంగా ఉంటుందీ చిత్రం. ప్రతి సన్నివేశం ఎగ్జయిటింగ్ గా అనిపిస్తుంది. కల్యాణ రమణ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలు బావున్నాయని అందరూ అభినందిస్తున్నారు. థియేట్రికల్ ట్రైలర్ కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నాడు.