తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎలక్షన్స్ కు సంబంధించి రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కుతోంది. కిందటి ఎన్నికల సమయానికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా ఎన్నికల బరిలోకి దిగలేదు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా పాలిటిక్స్ కే సమయం కేటాయిస్తాడనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. ఈ లెక్కన ఇప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అజ్ఞాతవాసి తరవాత సినిమాలేవీ ఉండవని అంతా అంచనా వేశారు.
కానీ జనవరిలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఒకప్పటి బడా ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం తనయుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ చెబుతున్నాడు. గోపీచంద్ హీరోగా జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఆక్సిజన్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతూ పవన్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చాడు. తమిళ మూవీ వేదాళంను నేశన్ డైరెక్షన్ లో తెలుగులో తెరకెక్కించనున్నారు. వాస్తవానికి పవన్ లేటెస్ట్ మూవీ కాటమ రాయుడుతో పాటే ఈ సినిమాకు కూడా కొబ్బరికాయ కొట్టారు. కాటమరాయుడు రిలీజై ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా కంప్లీట్ అవుతున్న టైంలో ఈ సినిమా గురించి మళ్లీ ఓ మాట వినిపించింది.
ఇంతకుముందు పవన్ నటించిన కాటమ రాయుడు సినిమా కూడా అజిత్ హీరోగా నటించిన వీరమ్ ను తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు అజిత్ హీరోగా నటించిన ఇంకో సినిమా వేదాళం కూడా పవనే మళ్లీ హీరోగా రీమేక్ చేస్తున్నాడు.