దర్శకేంద్రుడికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Update: 2018-08-28 06:56 GMT
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం తిరుమల తిరుపతి భక్తి ఛానెల్‌ కు రాఘవేంద్ర రావు చైర్మన్‌ గా వ్యవహరిస్తున్నారు. ఛానెల్‌ వ్యవహారాలు చూసుకునేందుకు వారంలో మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు టీటీడీ వారు రాఘవేంద్ర రావుకు ఒక ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ వాహనంలో కాకుండా అప్పుడప్పుడు తన సొంత వాహనంలోనే రాఘవేంద్ర రావు ప్రయాణిస్తూ ఉంటాడు. కొన్ని సార్లు టీటీడీ వారు ఇచ్చిన వాహనంలో రాఘవేంద్ర రావు సిబ్బంది ఉంటారు.

తాజాగా తిరుపతి నుండి ఘాట్‌ రోడ్డులో తిరుమల వెళ్తున్న సమయంలో ఎప్పటిలా తన సొంత కారులో రాఘవేంద్ర రావు వెళ్తుండగా - ఆ ముందు టీటీడీ వారు ఇచ్చిన వాహనం వెళ్తుంది. రెండు కార్లు కొద్ది దూరం తేడాతో ప్రయాణిస్తున్నాయి. ఆ సమయంలోనే ముందు కారు అదుపు తప్పి యాక్సిడెంట్‌ కు గురైంది. దాంతో ఆ కారులో ఉన్న డ్రైవర్‌ సహా రాఘవేంద్ర రావు సహాయకులు మరియు మేనేజర్‌ కు తీవ్ర గాయాు అయ్యారు. వారిని వెంటనే తిరుపతి హాస్పిటల్‌ కు తరలించారు.

గాయపడిన వారిలో డ్రైవర్‌ పరిస్థితి కాస్త సీరియస్‌ గా ఉందని వైధ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. రాఘవేంద్ర రావు కారుకు యాక్సిడెంట్‌ అంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు సినీ వర్గాల వారు మరియు ఆయన సన్నిహితులు వరుసగా ఫోన్స్‌ ఆయనకు కాల్స్‌ చేస్తున్నారు. అదృష్ట వశాత్తు తాను టీటీడీ కారులో ప్రయాణించడం లేదని, నా సొంత వాహనంలో ప్రయాణిస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒక వేళ టీటీడీ వాహనంలోనే రాఘవేంద్ర రావు ఉంటే ఊహించడానికే ఏదోలా ఉంది. ఆ తిరుమల వెంకటేశ్వరుడు నన్ను కాపాడాడు అంటూ రాఘవేంద్ర రావు సన్నిహితులతో చెబుతున్నారు
Tags:    

Similar News