రాఘవేంద్రరావు.. వెంకీతో.. సునీల్ తో

Update: 2018-03-11 07:26 GMT
తెలుగులో వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అరుదైన డైరెక్టర్లలో కె.రాఘవేంద్రరావు ఒకరు. ఊరికే వంద సినిమాలు పూర్తి చేయడం కాదు.. అందులో మెజారిటీ సినిమాల్ని విజయవంతం చేశారు. అందులో ఇండస్ట్రీ హిట్లు.. బ్లాక్ బస్టర్లు.. సూపర్ హిట్లు చాలా ఉన్నాయి. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకేంద్రుడు కెరీర్ చరమాంకంలో మాత్రం ఎక్కువగా భక్తి రస.. ఆధ్యాత్మిక చిత్రాలే చేశారు. చివరగా ఆయన తీసిన ‘ఓం నమో వేంకటేశాయ’పై చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. అది ఆయన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. దీని తర్వాత రాఘవేంద్రరావు మరో సినిమా తీయకపోవచ్చని ప్రచారం జరిగింది.

కానీ దర్శకేంద్రుడు త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. విక్టరీ వెంకటేష్.. సునీల్ లతో తాను ఆధ్యాత్మిక చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు. ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించి వర్క్ నడుస్తోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఐతే వెంకీ కానీ.. సునీల్ కానీ ఇప్పటిదాకా ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించలేదు. వీళ్లకు ఆ తరహా సినిమాలు సూటవుతాయో లేదో కూడా చెప్పలేం. హీరోగా వరుస వైఫల్యాల నేపథ్యంలో మళ్లీ కామెడీ వేషాలకు సునీల్ సిద్ధమవుతున్న తరుణంలో దర్శకేంద్రుడు అతడితో ఆధ్యాత్మిక సినిమా చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Tags:    

Similar News