ఇక రిటైర్మెంట్ ప్రకటించేశారు

Update: 2017-05-08 07:43 GMT
ఈ మధ్యనే మన తెలుగూ మేటి దర్శకుల్లో ఒకరైన కళాతపస్వీ కె విశ్వనాథ్ భారత దేశ ప్రభుత్వం సినిమాకి ఇచ్చే అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె అవార్డ్ అందుకున్నారు. ఆయన సినిమాలు తెలుగూ సినిమా సాగరంలో దొరికిన స్వాతిముత్యాలు. ప్రతీ తెలుగువాడి ఇంటిలో ఉండవలిసిన డి‌వి‌డిలు. తెలుగు సినిమాని మొదటిసారి ప్రపంచ స్థాయి ప్రదర్శనలో ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఈ సందర్భంగా మన తెలుగు వాళ్ళు ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. అక్కడ విశ్వనాథ్ గారు మాట్లాడుతూ  ''తెలుగు ప్రేక్షకులు నాకు కావలిసిన దానికంటే ఎక్కువ గౌరవాన్ని ప్రేమనూ ఇచ్చారు. నాకు ఇప్పుడు సినిమాలు తీసే౦తా ఓపిక కానీ కొత్తగా ఒక ఊహా ప్రపంచం సృష్టించేంత ఉత్సాహం కానీ లేదు. మీరు ఇచ్చిన చూపిన ప్రేమ తీసుకొని గౌరవంగా వెనుదిరుగుతున్న నేను ఇంకా సినిమాలు చేయను'' అని చెప్పేశారు.

తెలుగులో విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన శంకరాభరణం సాగర సంగమం స్వాతిముత్యం స్వయంకృషి సిరివెన్నెల ఇలా ఒక్కకోటి ఒక మైలురాలుగా మిగిలిపోయాయి. అందులో నటించిన ప్రతీ నటీనటుడు కెరీర్ లో అవే గొప్ప సినిమాలు. అయితే విశ్వనాథ్ చివరి సినిమా శుభప్రదం ఆయన స్థాయి సినిమా కాకపోయినా పర్లేదు బాగానే ఉంటుంది. కాకపోతే ఆ సినిమా ఫ్లాపుతో ఇక విశ్వనాథ్ తన జ్యూస్ అయిపోయిందని గ్రహించారు. మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News